వార్‌ వన్‌ సైడ్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయనున్న వైయస్‌ఆర్‌సీపీ 

 మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుబి మోగించనుంది. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన నవరత్నాలు పథకాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అధికార వికేంద్రీకరణ, దిశ చట్టం, చారిత్రాత్మకమైన చట్టాలు కేవలం 9 నెలల్లోనే చేయడంతో ప్రజలు జననేత వైయస్‌ జగన్‌కు జేజేలు పలుకుతున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ శనివారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహస్తామని పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇక ఒకే దశలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను 24న ప్రకటిస్తారు. ఇక ఈ నెల 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరిపి, 27న ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈనెల 27న తొలివిడుత పంచాయతీ ఎన్నికలు, 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల సమయంలో, పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో దాదాపు 90 శాతం  ఇప్పటికే అమలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు. నవరత్నాల పథకాలు పేద, మధ్య తరగతి కుటుంబాల్లో లబ్ధి పొందని వారిలో ఎవరూ ఉండరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం వైయస్ఆర్‌సీపీకి కలిసి వచ్చే అంశం. విద్యా, వైద్యానికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్ద పీట వేశారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, నాడు-నేడు, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు అద్భుతంగా ఉన్నాయి. రైతు భరోసా, సచివాలయ ఉద్యోగాలు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వైయస్‌ఆర్‌ మత్స్య భరోసా, వైయస్‌ఆర్‌ చేనేత నేస్తం, వైయస్‌ఆర్‌ లా నేస్తం, వాహన మిత్ర వంటి పథకాలతో అర్హులందరూ లబ్ధి పొందారు. ఇసుక సమస్యకు పరిష్కారం చూపగలిగారు. మరీ ముఖ్యంగా మద్యపాన నిషేదం దిశగా ప్రభుత్వం అడుగులు వేయడంతో మహిళలు ఆనందంగా ఉన్నారు. మహిళలకు రక్షణ కల్పించే దిశగా దేశంలోనే మొదటిసారిగా దిశ చట్టం చేయడంతో వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారు.  సంక్షేమ పథకాలు కుల, మతాలు, పార్టీలకు అతీతంగా అందుతుండటంతో స్థానిక సంస్థల ఎన్నికలు వన్‌సైడ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడుతాయని వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు దీమా వ్యక్తం చేస్తున్నాయి. 

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
మార్చి 7: నోటిఫికేషన్‌ విడుదల 
మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ
మార్చి 12: నామినేషన్ల పరిశీలన
మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 21: ఎన్నికల పోలింగ్‌
మార్చి 24: ఓట్ల లెక్కింపు

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌
మార్చి 9: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ
మార్చి 14: నామినేషన్ల పరిశీలన
మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 23: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్‌
మార్చి 15: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ
మార్చి 20: నామినేషన్ల పరిశీలన
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 27: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్‌
మార్చి 17: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ
మార్చి 22: నామినేషన్ల పరిశీలన
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 29: ఎన్నికల పోలింగ్‌
మార్చి 29: ఓట్ల లెక్కింపు
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top