మహిళల భద్రత, మహిళాభ్యుదయం కేంద్రంగా వైయస్ జగన్ పరిపాలన కొనసాగింది. కుటుంబ బాధ్యతలు మోస్తున్న వారికి ఊరటనిచ్చేలా నాడు జగన్ ప్రభుత్వం అండగా నిలబడితే, ఆ భరోసాను ఇప్పుడు లేకుండా చేశారు. దారుణంగా వారిని మోసం చేశారు. ఇవాళ మహిళల్ని మోసం చేసేలా, వాళ్లను అభద్రతకు గురి చేసేలా పరిపాలన సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణాలు జరిగినా పట్టించుకోవడంలేదు. గత ప్రభుత్వ పరిపాలనలో ఏ చిన్న దుస్సంఘటన జరిగినా స్పందించడానికి దిశ వంటి వ్యవస్థ ఉండేది. వేగంగా మహిళలకు సహాయం అందేది. నేడు రాష్ట్రంలో మహిళల రక్షణను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. మహిళలకు భద్రత కరువైంది. వారికి భరోసా లేకుండా పోయింది. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ఈ విషయంలో వారి వైఫల్యాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో స్వయంగా ఒప్పుకున్నారు. గత ఏడాది జూన్ నుంచి జనవరి మధ్య నెలల్లో (కూటమి పాలనలో) మహిళలపై నేరాలకు సంబంధించి 16,809 కేసులు నమోదైనట్లు శాసనసభలో హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఈ లెక్కన రాష్ట్రంలో గంటకు సగటున మూడు అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే కూటమి పాలనలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలుకు జగన్ సర్కారు చట్టం అధికారం చేపట్టిన వెంటనే నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు ఏకంగా 50 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా జగన్ చట్టం చేశారు. ఇక ఆచరణలో నామినేటెడ్ పదవుల్లో 51 శాతానికిపైగా పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం వైఎ స్సార్సీపీనే. గ్రామాల్లో వార్డు మెంబర్, పట్టణాల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ దగ్గరి నుంచి మంత్రి పదవుల దాకా మహిళలకు అగ్రపీఠం దక్కడం దేశంలోనే రికార్డు. తొలిసారిగా శాసన మండలి వైస్ చైర్మన్ గా జకియా ఖానంను నియమించారు. రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి అవకాశం కల్పించారు. విభజన అనంతరం మహిళా కమిషన్ ను నియమించి మహిళల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశపద్ధిని చాటారు. మహిళకు తొలిసారిగా హోంమంత్రి పదవి ఇచ్చి నాడు వైఎస్సార్ రికార్డు సృష్టిస్తే.. తండ్రి కంటే రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను వైయస్ జగన్ నిరూపించుకున్నారు. తొలి మంత్రివర్గంలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితను, ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్ప శ్రీవాణిని నియమించారు. మలి విడత విస్తరణలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతోపాటు మరో ముగ్గురు మహిళలకు కీలక మంత్రి పదవులను అప్పగించారు. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్మన్ పదవుల్లో ఏడుగురు మహిళలే ఉన్నారు. 26 జెడ్సీ వైస్ చైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలకు అవకాశం కల్పించారు. 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 మంది మహిళలే ఎన్నికయ్యేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం, 1.30 లక్షల సచివాలయాల ఉద్యోగాల్లో 51 శాతం మహిళలకే దక్కడం విశేషం. సచివాలయాల్లో సగం ఉద్యోగాలు మహిళలకే.. సచివాలయాల ఏర్పాటుతో ప్రజల వద్దకు పాలనను చేరువ చేసిన జగన్.. ఆ సచివాలయాల్లో సగం ఉద్యోగాలు మహిళలకే ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా లక్షా 27 వేల ఉద్యోగాలు ఇవ్వగా, 63,791 ఉద్యోగాలు (51శాతం) మహిళలకే దక్కాయి. గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల పోస్టుల్లో 53 శాతం మహిళలకే ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖలో ఐదేళ్లలో దాదాపు 53 వేల ఉద్యోగాలు భర్తీ చేయగా, మూడొంతులు మహిళలకే ఇచ్చారు. ప్రతి అడుగులో తోడుగా..: బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పండు ముసలావిడ వరకు.. వారికి ఏ వయసులో ఏం అవసరం ఉందో వారిని చెయ్యి పట్టుకుని నడిపించిన ప్రభుత్వం వైయస్సార్సీపీ ప్రభుత్వం. పిల్లలు పుట్టినప్పుడే రూ.5 వేలు ఆరోగ్య ఆసరాతో పంపించే పరిస్థితి నుంచి మొదలుపెడితే, పెళ్లి చేయడానికి వైయస్సార్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా.. ఆ పిల్లలను బడికి పంపడానికి ఆ పిల్లల తల్లులకు అమ్మ ఒడి.. తర్వాత తన కాళ్లపై తాను నిలబడేలా అండగా నిలబడేలా వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ద్వారా తమ కాళ్ల మీద తామే నిలబడేలా జగన్ సర్కారు అడుగులు వేసింది. ఐటీసీ, పీఅండ్ జీ, అమూల్ లాంటి సంస్థలను తీసుకొచ్చి వారిని భాగస్వాములను చేసి ఆదాయం పెంచేలా తోడుగా నిలబడింది. చంద్రబాబు హయాంలో రూ.1000 పెన్షన్ ఉంటే, దాన్ని రూ.3 వేలకు పెంచి పండు వయసులో ఉన్న వృద్ధులకు అండగా నిలబడింది. ఆర్థికంగా చేయూతే కాకుండా లక్షలాది పేద కుటుంబాలలో వెలుగు నింపేందుకు ఐదేళ్లలో ప్రభుత్వం నవరత్నాల కింద ఏకంగా రూ.1,89,519.08 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లో జమచేసింది. వీటికి అదనంగా అర్హత ఉన్న ప్రతి మహిళకు ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి నిధులు అందజేశారు. ఈ కార్యక్రమాల ద్వారా మరో రూ. 94,347.28 కోట్లు ప్రభుత్వం సాయం చేసింది. ఏకంగా రూ. 2,83,866 కోట్లను డీబీటీ, నాన్ డీబీటీ (పరోక్ష లబ్ధి) రూపంలో మహిళలకు అందజేశారు. 1.89 లక్షల కోట్లు నేరుగా ఖాతాలోకి.. తన పాదయాత్రలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కష్టాలు వైఎస్ జగన్ కళ్లారా చూశారు.. నేనున్నానని మాటిచ్చారు. ఇచ్చిన మాట మేరకు 2019లో అధికారంలోకి రాగానే ఆ మాట నిలుపుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) వివరాల ప్రకారం మహిళల పేరిట పొదుపు సంఘాలలో ఉండే రూ.25,571 కోట్ల రుణాన్ని నాలుగు దపాలుగా ప్రభుత్వమే నేరుగా మహిళల చేతికి అందజేసింది. మొత్తం 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మొత్తం 78,94,169 మంది మహిళల పేరిట అప్పట్లో బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తం వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా లబ్ధి పొందిన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారాయి. నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 0.45 శాతానికి తగ్గాయి. సున్నా వడ్డీ కింద రూ.4,969 కోట్ల సాయం చంద్రబాబు రుణాలు మాఫీ చేయకుండా మహిళల్ని మోసగించడమే కాకుండా.. సున్నా వడ్డీ పథకం సైతం రద్దు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని మళ్లీ అమలు చేసి నాలుగేళ్లలో కోటి మందికి పైగా మహిళలకు వైఎస్సార్ సున్నా.. వడ్డీ పథకంలో రూ. 4,969.04 కోట్లను ఖాతాల్లో జమ చేసింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీతో పొదుపు సంఘాలు క్రియాశీలకంగా మారడంతో నిరర్ధక ఆస్తులు (ఎన్ పీఏ) 18:36 శాతం నుంచి 0.45 శాతానికి తగ్గాయి. దీంతో 99.5 శాతం మంది మహిళలు ఇప్పుడు సకాలంలో రుణాలు చెల్లించే స్థాయికి ఎదిగారు. డ్వాక్రా సంఘాలకు ఊపిరి బాబు హయాంలో డ్వాక్రా పొదుపు సంఘంలో మొత్తం 10 మంది సభ్యులుంటే అందరికీ కలిపి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు మించి బ్యాంకు రుణం ఇచ్చేవారు కాదు. జగన్ ప్రభుత్వం ఆసరాతో బ్యాంకు రుణాలు తీరడం, కొత్త రుణాలు సకాలంలో చెల్లించడంతో ఒక్కో సంఘానికి ఏకంగా రూ.20 లక్షల రుణం ఇచ్చారు. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే తక్కువ వడ్డీకే (సున్నా వడ్డీ కింద మాఫీ) రుణాలు తీసుకొని, మళ్లీ ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు. ఐదేళ్లలో ఏకంగా రూ.1,73,474.94 కోట్లు బ్యాంకుల ద్వారా రుణంగా పొందారు. మహిళా సాధికారతకు 'చేయూత' జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో వైఎస్సార్ చేయూత పేరుతో వినూత్న కార్యక్రమాన్ని అమలు చేసింది. ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 45---60 ఏళ్ల మధ్య వయసుండే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు నాలుగు విడతల్లో మొత్తం రూ.75 వేలు చొప్పున 26,98,931 మందికి రూ.19,189.60 కోట్లను అందించింది. కేవలం ఆర్థిక సాయానికే పరిమితం కాకుండా చిన్న, మధ్య తరహా వ్యాపారాల ఏర్పాటుకు ముందుకొస్తే.. వారికి అదనపు తోడ్పాటు అందించారు. ఐదేళ్లలో చేయూతలో 19,37,568 పేద మహిళలు వివిధ ఉపాధి మార్గాలతో నెలనెలా రూ.8 వేల నుంచి రూ. 10 వేల వరకు ఆదాయం పొందారు. అమూల్ లాభాల్లోనూ అక్క చెల్లెమ్మలకూ వాటా జగన్ సర్కారు 2020 జూలై 21న అమూల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. డిసెంబర్ 3న అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టు తొలి దశను అప్పటి సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. అమూల్ రావడం వల్ల పాడి రంగంలో ఉన్న 27 లక్షలకు పైగా అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూరింది. పాలు పోస్తున్న అక్క చెల్లెమ్మలకు అమూల్ లాభాల్లో ఏటా రెండు సార్లు వాటాలు ఇప్పించారు.అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు ఈ కార్యక్రమాలు ఎంతో దోహదపడ్డాయి. సూపర్ సిక్స్ ఒట్టి దగా.. ఎన్నికల సమయంలో మహిళలకు ఎన్నో హామీలిచ్చిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా దగా చేసింది. జగన్ సర్కారు అమలు చేసిన పథకాలన్నింటినీ అటకెక్కించింది. దీపం, ఆసరా, చేయూత తదితర పథకాలకు మంగళం పలికింది. మహిళలకు ఫ్రీ బస్సు, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ పథకం ఊసే ఎత్తడం లేదు. అమ్మ ఒడి స్థానంలో తెచ్చిన తల్లికి వందనం కోసం గత బడ్జెట్లో కేటాయింపులు చూపెట్టి పైసా కూడా ఇవ్వకుండా మోసం చేసింది. ఈసారి కోత పెట్టింది. దీపం పథకానికీ కేటాయింపుల విషయంలో జిమ్మిక్కులు చేస్తోంది. ఆడబిడ్డ నిధి దగా : ఎన్నికల వేళ చంద్రబాబునాయుడు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500.. అంటే ఏడాదికి రూ.18 వేలు ఇస్తానన్నారు. దానికి ఆడ బిడ్డ నిధి అని బ్రహ్మాండమైన పేరు పెట్టాడు. దాదాపు 1.80 కోట్ల మంది మహిళలకి ఏటా రూ.18 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.32,400 కోట్లు కావాలి. కానీ, నిరుడు బడ్జెట్‌తో పాటు, ఈ బడ్జెట్‌లోనూ కేటాయింపులు సున్నా. అంటే ప్రతి మహిళకు చంద్రబాబు రూ.36 వేలు బాకీ పడ్డారు. ఉచిత బస్సు. రానే లేదు: చంద్రబాబు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఇది చాలా చిన్న హామీ. వాస్తవం చెప్పాలంటే. నెలకు రూ.275 కోట్లు కావచ్చు. అంటే ఏటా మహా అయితే రూ.3500 కోట్లు కావచ్చు. కానీ రెండు బడ్జెట్లలోనూ ఎగనామమే. రాయలసీమలో మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం పోయి రావచ్చు కదా అని. అలాగే కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు.. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా అని. కానీ ఈ పథకానికి రెండు బడ్జెట్లలో ఏ కేటాయింపులు చేయకుండా, మహిళలకు ఫ్రీ బస్సు రూపేణా మరో రూ.7వేల కోట్లు చంద్రబాబు బాకీ పడ్డారు. వారికి ఎగరగొట్టారు. తల్లికి వందనం. మరో మోసం: స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు. ఇద్దరు పిల్లలుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు, ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పారు. మ్యానిఫెస్టోలో కూడా పెట్టి, దానికి తల్లికి వందనం అని పేరు పెట్టారు. గత ఏడాది తొలి బడ్జెట్‌లో రూ.5,386 కోట్లు కేటాయించినా, ఒక్క రూపాయి కూడా డబ్బు ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు చూపారు. కానీ, బడ్జెట్ డాక్యుమెంట్స్, డిమాండ్స్ ఫర్ గ్రాంట్‌లో చూస్తే అక్కడ రూ.8,278 కోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి.ఈ ఒక్క పథకం ద్వారానే ప్రతి పిల్లాడికీ చంద్రబాబు రెండేళ్లలో రూ.30 వేలు బాకీ పడ్డారు. అంటే, చివరికి చిన్న పిల్లలను కూడా ఆయన వదలడం లేదు. దీపం. గ్యాస్ సిలిండర్ లేదు: దీపం పథకానికి రూ.4 వేల కోట్లు ఖర్చవుతుంది. పథకంలో అర్హులుగా రాష్ట్రంలో 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మినిస్ట్రీ ఫర్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వెబ్‌సైట్‌లోనూ, పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్‌లోనూ ఇది క్లియర్‌గా కనిపిస్తుంది.వారందరికీ ఏటా మూడు ఫ్రీ సిలిండర్లు ఇవ్వడానికి రూ.4 వేల కోట్లు కావాలి. కానీ, తొలి ఏడాది ఇచ్చింది రూ.865 కోట్లు మాత్రమే. ఈ ఏడాది కేటాయించింది రూ.2,439 కోట్లు. ఇది కూడా ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, మోసమే కాబట్టి ఆ కేటాయింపు చేశారు. 50 ఏళ్లకే పెన్షన్. ఒట్టిదే: మరో ముఖ్యమైన హామీ. 50 ఏళ్లకే పెన్షన్ అన్నాడు. నిజంగా 50 ఏళ్లకు, బీసీ, ఎస్సీ, మైనార్టీలకు పెన్షన్లు ఇవ్వాలంటే మరో 20 లక్షల కుటుంబాలు యాడ్ అవుతాయి. వారికి నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే రూ.9,600 కోట్లు కావాలి. తొలి ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా అదే పని చేశారు. అలా రెండేళ్లలో మహిళలకు రూ.96 వేలు బాకీ పడ్డారు. నిరుద్యోగ భృతి లేదు: రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, లేదంటే నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ 20 లక్షల్లో సగం మంది మహిళలు ఉంటారు. ఆ లెక్కన ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36 వేల చొప్పున 10 లక్షల మందికి కనీసం రూ.3,100 కోట్లు ఇవ్వాలి. మరి యువగళం ఊసే బడ్జెట్లలో లేదు. పెన్షన్ల కోత: ఇక పెన్షన్ల విషయానికి వస్తే, మా ప్రభుత్వంలో ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి 66,34, 372 పెన్షన్లు ఇస్తుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 62,10,969కు పడిపోయింది. ఈ 10 నెలల్లో ఒక్క పెన్షన్ యాడ్ కాలేదు. ఉన్న పెన్షన్లు కూడా తగ్గించుకుంటా పోతున్నారు. ఏకంగా 4 లక్షల పెన్షన్లు కట్ చేశారు. మామూలుగా పెన్షన్లకు రూ.32 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ కేటాయించింది రూ.27 వేల కోట్లు మాత్రమే. అంటే రూ.5 వేల కోట్లు కోత. పెన్షన్లు పెరగాల్సింది పోయి, తగ్గుతున్నాయి.