గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 తొలి రోజు గ్రాండ్ స‌క్సెస్‌

వైయ‌స్ జగన్‌ దార్శనికతే ఏపీ ప్రగతి దిక్సూచి 

ఉదాహరణలతో సహా వివరించిన పారిశ్రామిక దిగ్గజాలు

జగన్‌ దార్శనికతతోనే సులభతర వాణిజ్యంలో ఏపీకి మొదటి స్థానం: ముఖేశ్‌ అంబానీ

దక్షిణ భారత దేశంలో పెట్టుబడుల సదస్సుకు తొలిసారి హాజరైన ముఖేశ్

వనరుల సద్వినియోగంతో అభివృద్ధి ప్రణాళికలు జగన్‌ ప్రత్యేకత : కరణ్‌ అదానీ

జగన్‌ ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చారు : నవీన్‌ జిందాల్‌

సంక్షోభంలోనూ సమర్ధ నాయకుడు జగన్‌ : కబ్‌ డాంగ్‌లీజగన్‌ సహకారంతోనే అతి పెద్ద ప్లాంట్‌ సాధ్యమైంది : సుమిత్‌ బిదానీ

ఇంతటి పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం చాలా అరుదు: మసహిరో యమగుచి

జె ఫర్‌ జగన్‌.. జె ఫర్‌ జోష్‌గా మారింది : పునీత్‌ దాల్మియా  

విశాఖ‌: దేశీయ, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంతా ఒకే వేదికపైకి వచ్చిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 తొలి రోజు గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. అంత‌కుమించి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికత, కార్యదక్షతకు నిదర్శనంగా నిలిచింది.  వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, సరళతర వాణిజ్య విధానాలు ఎంతటి సత్ఫలితాలను అందిస్తున్నాయో ప్రపంచానికి చాటి చెప్పింది.  సదస్సులో తొలి రోజు శుక్రవారం దాదాపు 20 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించారు.
 
సీఎం వైయ‌స్ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో సృష్టించిన పారి­శ్రామిక అనుకూల వాతావరణం గురించి దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రముఖంగా ప్రస్తావించారు. సీఎం వైఎస్‌ జగన్‌ యువ నాయకత్వం, దార్శనికతతోనే వృద్ధి రేటు, సులభతర వాణిజ్యంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కొనియాడటం విశేషం. దక్షిణ భారత దేశంలో నిర్వహించిన ఓ పెట్టుబడుల సదస్సుకు ఆయన హాజరుకావడం ఇదే తొలిసారి. పారిశ్రామికాభివృద్ధిపట్ల సీఎం జగన్‌ స్పష్టమైన దృక్పథానికి ఆకర్షితుడయ్యే ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు.

సహజ వనరులు, భౌగోళిక అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి  ప్రణాళికలు రూపొందించడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేకత అని ఆదానీ పోర్ట్‌ – సెజ్‌ సీఈవో కరణ్‌ అదానీ చెప్పారు. దేశంలోనే రెండో అతిపెద్ద తీరరేఖ కలిగిన ఏపీలో పోర్టుల అభివృద్ధికి జగన్‌ ప్రణాళికలు ఇందుకు నిదర్శనమన్నారు. పారిశ్రామిక విధానం, పరిశ్రమల అనుకూల ఎకోసిస్టమ్‌ కల్పిం­చేందుకు సమర్థంగా అమలు చేస్తున్న సింగిల్‌ విండో పాలసీ గురించి జేఎస్‌పీఎల్‌ గ్రూప్‌ చైర్మన్‌ నవీన్‌ జిందాల్‌ ప్రధానంగా ప్రస్తావించారు. సీఎం జగన్‌ దార్శనిక విధానాల ఫలితంగానే తమ గ్రూప్‌ ఏపీలో రూ.10 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే అగ్రగామిగా నిలిపి సీఎం జగన్‌ ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చారన్నారు.

రూ.13 లక్షల కోట్లు- 340 ఎంఓయూలు :   సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
ఈ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ల విలువైన 340 పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలతో ముందుకు రావడం రాష్ట్రానికి గర్వకారణం. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 రంగాల్లో దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 

తొలిరోజు రూ.11.85 లక్షల కోట్లకు...
ఈ రోజు రూ.11.85 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులకు సంబంధించిన 92 ఎంఓయూలును  కుదుర్చుకోనున్నాం. వీటి ద్వారా దాదాపు 4లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మిగిలిన 248 ఎంఓయూలు రేపు కార్యరూపం దాల్చనున్నాయి.  ఈ ఒప్పందాల విలువ రూ.1.15 లక్షల కోట్లు కాగా... వీటి ద్వారా దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 
రిలయెన్స్‌ గ్రూపు, ఆదానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్‌ గ్రూప్, మోండలీస్, పార్లీ, శ్రీ సిమెంట్స్‌ వంటి కంపనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. ఈ సందర్భంగా వారికి ధన్యవాదమలు. 

జీఐఎస్‌కి స్వాగతం...
ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు – 2023 కు వచ్చి, ఈ సదస్సులో భాగస్వాములైన మీ అందరికీ  కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనస్వాగతం పలుకుతున్నాను. 
మిమ్మల్ని అందర్నీ కలుసుకునే ఈ సదస్సు ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులందరికీ మేం ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. మీరు మాకు చాలా చాలా ముఖ్యమైన వారు. మా రాష్ట్రం యొక్క బలాలు, మేము కల్పించే విభిన్న అవకాశాలను, వ్యాపార రంగంలో స్నేహపూర్వక వాతావరణం, బలమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన పోటీ, ఆవిష్కరణల విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీ భాగస్వామ్యం ద్వారా స్థిరమైన, దీర్ఘకాలిక వృద్ధి సాధించడంపట్ల మేం సంకల్పంతోనే ఉన్నాం. 

విశాఖ -బలమైన ఆర్ధిక కేంద్రం...
పలు ప్రభుత్వ, మరియు ప్రైవేట్‌ రంగ యూనిట్లు, పోర్ట్‌ ఆధారిత మౌలిక సదుపాయాలు, మెడ్‌టెక్‌ జోన్‌ మరియు టూరిస్ట్‌ హాట్‌స్పాట్‌లతో విశాఖపట్నం అత్యంత బలమైన బలమైన ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించింది. విశాఖపట్నంలో ఈవెంట్‌ను నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. విశాఖపట్నం కేవలం పారిశ్రామిక రంగంలో బలమైన నగరమే కాకుండా, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఈ సదస్సును నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది.

2023 సంవత్సరం భారతదేశానికి చాలా ముఖ్యమైన సంవత్సరం, ఈ ఏడాది సెప్టెంబరులో ఒన్‌ఎర్త్, ఒన్‌ ఫ్యామిలీ, ఒన్‌ ఫ్యూచర్‌ ‘‘ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’ అనే థీమ్‌తో జీ–20 సదస్సును నిర్వహిస్తోంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో– దేశం నిర్వర్తిస్తున్న జీ –20 అధ్యక్ష బాధ్యతలు మనకు అత్యంత కీలకం అవుతాయని బలంగా నమ్ముతున్నాను. మార్చి చివరివారంలో జరిగే జి–20 వర్కింగ్‌ కమిటీ  సమావేశాలకు విశాఖ నగరం కూడా ఆతిథ్యం ఇస్తోంది. 

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ ఒకటి. ఈదేశం తన సమర్థతను చాటుకుని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అగ్ర గమ్యస్థానాలలో ఒకటిగా ఉద్భవించింది.

అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌
భారత్‌ను వృద్ధిపథంలో నడిపే అగ్రగామి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. సమృద్ధిగా ఉన్న సహజ వనరులు, ఖనిజ సంపద, 974 కి.మీ తీరప్రాంతం మొదలైన వాటితో సహా అనేక సహజమైన, ప్రకృతి సిద్ధమైన బలాలు, సానుకూలతలు రాష్ట్రానికి ఉన్నాయి. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరుపోర్టులకు తోడు కొత్తగా రానున్న మరో నాలుగు పోర్టులతో రాష్ట్రానికి బలమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 6 విమానాశ్రయాలు ఉన్నాయి, వీటిలో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు. దేశంలో అభివృద్ధి చెందుతున్న పదకొండు పారిశ్రామిక కారిడార్లలో మూడు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. వీటిలో 10 పారిశ్రామిక నోడ్స్‌ఉన్నాయి. అనేక ప్రముఖ విద్యాసంస్థలు, వ్యూహాత్మక ప్రాంతాలతో సానుకూలతలు, ల్యాండ్‌ బ్యాంక్, నైపుణ్యం కలిగిన యువత, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక – వ్యాపార పర్యావరణ వ్యవస్థ ఇక్కడ ఉంది. అంతేకాదు.. పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చేందుకు అవసరమైన విధానాల కార్యాచరణ ప్రణాళికలు సహా చురుకైన, సానుకూలత ఉన్న  ప్రభుత్వం ఇక్కడ ఉంది. 

ఏపీ- దేశంలో అత్యధిక జీస్‌డీపీ
అంతేకాకుండా 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 11.43% జీఎస్‌డీపీ వృద్ధిరేటు సాధించింది, ఇది దేశంలోనే అత్యధికం. ఇంకా, గత మూడు సంవత్సరాలల్లో ఎగుమతులు కూడా వృద్ధిచెందాయి. సీఏజీఆర్‌(సగటు వార్షిక వృద్ధిరేటు) 9.3% నమోదయ్యింది. సుస్థిరమైన, స్థిరమైన అభివృద్ధి కోసం మేం చేస్తున్న ప్రయత్నాలను నీతి ఆయోగ్‌ కూడా గుర్తించింది. సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ అంశాల్లో 2020–21 ఏడాదికి ఇచ్చిన  ఎస్‌జీడీ ఇండియా ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం నంబర్‌ 3వ స్థానంలో నిలిచింది. 
అట్టడుగు స్థాయిలో పరిపాలనను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చింది. వ్యాపార వాతావరణాన్ని సృష్టించడంకోసం, స్థిరమైన విధానాలు, పోటీతత్వాన్ని పెంపొందించడానికి, తక్కువ రిస్క్ పెట్టుబడి వాతావరణాన్ని కల్పించడానికి, పారదర్శకతను పెంపొందించడానికి ఈ చర్యలు తీసుకుంది. 

నాలుగు అత్యంత ప్రాధాన్యాంశాలు...
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చే, ఆర్థిక మరియు పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన నాలుగు ప్రధాన అంశాలను ఇక్కడ స్పష్టంగా చెప్పదలచుకున్నాను. 
1. గ్రీనిఫికేషన్‌( పర్యావరణ సానుకూలత విధానాలు)
2. ఇండస్ట్రియల్‌ – లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 
3. డిజిటలైజేషన్‌
4.ఎంటర్‌ ప్రైజ్‌ మరియు స్కిల్‌ డెవలప్మెంట్‌

గ్రీనిఫికేషన్‌కు ముందు ఒక అంశాన్ని చెప్పదలచుకున్నాను. డీ కార్బనైజేషన్‌ అనేది అత్యంత ముఖ్యమైనది, అత్యవసరమైంది కూడా. సంప్రదాయేతర ఇంధనం దిశగా మార్పు చెందడానికి మేం అత్యంత శ్రద్ధపెట్టాం. సంప్రదాయేతర ఇంధన వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయి. 82 గిగావాట్ల సంప్రదాయేతర ఇంధనం ఉత్పత్తిని సాధించానికి రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి. సోలార్, విండ్, పంప్‌డ్‌ స్టోరేజీ ఈ మూడు రకాల ఇంధనాలు సమ్మిళితంగా పొందడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ ప్రాజెక్టులు ప్రారంభించడానికి అవసరమైన ల్యాండ్‌ పార్సిళ్లను కూడా ప్రభుత్వం గుర్తించింది. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక భౌగోళిక లక్షణాలు ఉన్నాయి. 34 గిగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉంది. 24 గంటలపాటు ఈ ప్రాజెక్టు నుంచి సంప్రదాయేతర ఇంధనాన్ని పొందవచ్చు. అలాగే అతి పెద్దదైన తీర ప్రాంతాన్ని వినియోగించుకుని గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగం, ఉత్పత్తి, ఎగుమతులకు రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయి. 

ఇండస్ట్రియల్‌ మరియు లాజిస్టిక్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ విషయంలో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుతీరంలో ఒక గేట్‌వేగా చెప్పదలచుకున్నాను.974 కి.మీ. పొడవైన తీరప్రాంతం రాష్ట్రానికి ఉంది. సముద్ర రవాణా, సంబంధిత అంశాల్లో రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా నాలుగు పోర్టులను నిర్మిస్తున్నాం. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు మరియు కాకినాడల్లో కొత్త పోర్టులను నిర్మిస్తున్నాం. ఇప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరు పోర్టులకు ఇవి అదనం. వీటికి సమీపంలో పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణకు అవకాశాలున్నాయి. 

ఏపీ- మూడు పారిశ్రామిక కారిడార్లు.
దేశంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే. వైజాగ్‌– చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్, చెన్నై – బెంగుళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్, హైదరాబాద్‌– బెంగుళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్లు రాష్ట్రంలో ఉన్నాయి. డిమాండ్‌ఉన్న ప్రాంతాలకు ఈ కారిడార్లు సమీపంలో ఉన్నాయి. ఈ మూడు కారిడార్లకు పోర్టులతో అద్భుతమైన రవాణా అనుసంధానం కూడా ఉంది. ఈ పారిశ్రామిక కారిడార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 10 నోడ్స్‌– ఇండస్ట్రియల్‌ హబ్స్‌గా తయారవుతాయి. 

సరుకు రవాణాలో సమయాన్ని, ఖర్చులను ఆదా చేయడానికి రాష్ట్రంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో 5 మల్టీమోడల్‌ లాజిస్టిక్‌  పార్కులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. సముద్ర ఉత్పత్తులను పెంచడానికి, ప్రాససింగ్‌ల కోసం కొత్తగా 9 హార్బర్లను కూడా కడుతున్నాం. 

అంతేకాక వివిధ పారిశ్రామిక రంగాలకు సంబంధించి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, పుడ్‌ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్‌ తదితర రంగాలకు సంబంధించి నిర్దిష్టంగా క్లస్టర్లు ఉన్నాయి. ఇవి చక్కటి మౌలిక సదుపాయాలను, నిపుణులైన మానవ వనరులను అందిస్తాయి. 

మెడ్‌టెక్‌ కంపెనీలకు పుట్టినిల్లు ఏపీ. విశాఖపట్నంలో ఉన్న మెడ్‌టెక్‌ జోన్ల్‌ అనేక మెడ్‌టెక్‌ కంపనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఈ రంగంలో మరింత వృద్ధికోసం ప్లగ్‌ అండ్‌ ప్లే పద్ధతిలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. దీనివల్ల సమయం, ఖర్చులు ఆదా అవుతాయి. 

ఇక మూడో స్తంభంగా నేను పేర్కొన్న డిజిటలైజేషన్‌ కూడా అత్యంత ముఖ్యమైనది. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం సింగిల్‌ పోర్టల్‌ సేవలను అందిస్తోంది. 23 విభాగాల్లో 90 రకాల వ్యాపార సేవలు ఈ పోర్టల్లో లభిస్తాయి. వ్యాపారాలు ప్రారంభించడానికి అవసరమైన అనుమతులను 21 రోజుల్లో అందిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణగా మేం నెలకొల్పిన గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా 540 రకాల సేవలను ఏపీ ఇ–సేవల ద్వారా పౌరులకు అందిస్తున్నాం. 

ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తొలిస్ధానం.
వేగవంతమైన ఎంటర్ర్‌ప్రైజెస్‌ డెవలప్‌మెంట్‌ సాధించడానికి అనుకూలమైన వ్యాపార వాతావరణం అవసరమని నేను బలంగా నమ్ముతాను. పెట్టుబడి దారులకు చక్కటి వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దృష్టిపెట్టింది. ఈజ్‌ ఆఫ్‌ డూయినంగ్‌ బిజినెస్‌లో దేశంలోనే మొదటి స్థానంలో రాష్ట్రం ఉండడం దీనికి నిదర్శనం.  గడచిన మూడు సంవత్సరాలుగా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలోని ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో వాణిజ్య మరియు పారిశ్రామిక వేత్తల నుంచి స్వీకరించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించింది. రాష్ట్రం అత్యధికంగా 97.89శాతం సానుకూల ఫీడ్‌ బ్యాక్‌తో ప్రథమ స్థానంలో నిలిచింది. పరిశ్రమలు పెట్టేవారికి మరింత సులభతరంగా ఉండడానికి మేం సానుకూలంగా వ్యవహరించి కొన్ని చట్టాలను సవరించడమో, లేక వాటిని తొలగించడమో చేశాం. 
పారిశ్రామికంగా అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే మంచి మౌలిక సదుపాయాలు, మంచి వ్యాపార వాతావరణంతో పాటు, నైపుణ్యం ఉన్న మాన వనరులు కూడా అత్యంత కీలకమైనవి. దీనికోసం దాదాపు 26 చోట్ల నైపుణ్యాభివృద్ధి  కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. పారిశ్రామిక సంస్థల సహకారంతో  స్థానిక యువకుల్లో నైపుణ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేయడానికి ఈ కాలేజీలను పెడుతున్నాం.  

ఫోన్ కాల్‌ దూరంలో ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 సందర్భంగా ఈ రెండు రోజుల్లో రాష్ట్రానికున్న బలాలు, సానుకూలతలను మేం ప్రదర్శిస్తాం. రాష్ట్రంలో ఉన్న పుష్కలమైన అవకాశాలపై అవగాహన చేసుకునేందుకు వీలుగా మీమీ బృందాలను వివిధ అంశాలపై ఏర్పాటుచేసిన సెషన్స్‌లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను. వ్యాపారాలు చేసేవారికి మంచి వాతావరణం కల్పించేందుకు మేం చాలా కృతనిశ్చయంతో ఉండడమే కాకుండా, మీకు ఎప్పుడు ఏం అవసరమైనా సహకారం అందించేందుకు కేవలం మేం ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటామని అందరికీ తెలియజేస్తున్నాను. 

ఈ సదస్సులో భాగస్వాములు అయినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కార్యనిర్వాహక రాజధాని కానున్న విశాఖపట్నంలో, అందమైన విశాఖపట్నంలో అద్భుతమైన సమయాన్ని గడపాలని ఆశిస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

  
సమర్థ నాయకుడు
సంక్షోభం తలెత్తినప్పుడు సమర్థంగా వ్యవహరించడమే నాయకత్వ లక్షణమని కియా మోటార్స్‌కు చెందిన కబ్‌ డాంగ్‌లీ చెప్పారు. అలాంటి నాయకుడు జగన్‌ అని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులు, ముడి సరుకును సురక్షితంగా తరలించడానికి సీఎం జగన్‌ సత్వరం సహకారం అందించడం ఇందుకు తార్కాణమన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధే ఆర్థికాభివృద్ధికి చోదక శక్తి అనే వాస్తవాన్ని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని సైయెంట్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి కొనియాడారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య–ఆరోగ్య రంగాలపై ఏపీ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తుండటం దేశానికే ఆదర్శమన్నారు. 

గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎంవోయూల పేరుతో చేసిన కనికట్టు అందరికీ తెలిసిందే. ఛోటామోటా నేతలకు సూట్లు వేసి మరీ ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు ప్రజల్ని మోసం చేశారు. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో చేసుకున్న ఎంవోయూలలో 10 శాతం కూడా కార్యరూపం దాల్చలేదు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తూ పరిశ్రమల ఏర్పాటును స్వయంగా పర్యవేక్షిస్తుండటం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే విషయాన్ని కెనాఫ్‌ సంస్థ సీఈవో సుమిత్‌ బిదానీ జీఐఎస్‌ సభా వేదిక మీదే చెప్పారు. 40 మిలియన్‌ డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో దేశంలోనే అతి పెద్ద ప్లాంట్‌ను తాము ఏర్పాటు చేయడం కేవలం సీఎం జగన్‌ సహకారంతోనే సాధ్యమైందని ఆయన అన్నారు. ఒప్పందం జరిగిన 18 నెలల్లోనే ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

ఇంతటి పారిశ్రామిక అనుకూలత అరుదు
సీఎం జగన్‌ నిబద్ధత గురించి జపాన్‌కు చెందిన టోరే ఇండస్ట్రీస్‌ ఎండీ మసహిరో యమగుచి చెప్పిన విష­యం అబ్బురపరిచింది. శ్రీ సిటీలో రూ.200 కోట్లతో తాము త్వరగా ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం 132 కేవీ విద్యుత్‌ లైన్‌ను ప్రత్యేకంగా వేయడాన్ని ఆయన ఉదహరించారు. ఇంతటి పారిశ్రామిక అనుకూల ప్రభు­త్వం ఉండటం చాలా అరుదని వ్యాఖ్యా­నించారు.

సంప్రదాయేతర ఇంధన వనరులకు సీఎం జగన్‌ పెద్దపీట వేస్తుండటం ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్‌ పారిశ్రామిక పరిణామాలపై ఆయనకున్న ముందు చూపునకు నిదర్శనమని టెస్లా కంపెనీ కో ఫౌండర్‌ మార్టిన్‌ ఎబర్‌హార్డ్‌ తెలిపారు. శ్రీ సిమెంట్‌ చైర్మన్‌ హరిమోహన్‌ బంగర్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిమెంట్‌ రంగంలో తాము ఈ కారణంగానే ఏపీలో పెట్టుబడులు పెడుతున్నామన్నాఉ. ఇప్పటికే రూ.3,000 కోట్లతో గుంటూరులో తాము ఏర్పాటు చేస్తున్న దేశంలోనే మొదటి గ్రీన్‌ సిమెంట్‌ ప్లాంట్‌ పనులు నడుస్తున్నాయని, త్వరలో మరో రూ.5,000 కోట్లు పెట్టుబడులతో 5 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. 

అపారమైన సహజ వనరులు.. నైపుణ్యమైన మానవ వనరులు అభివృద్ధికి మూలం. కీలకమైన ఆ రెండింటినీ గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకునే సమర్థ నాయకత్వం ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో అటువంటి సమర్థ నాయకత్వం లభించిన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలవడం ఖాయం. వైఎస్‌ జగన్‌ దార్శనికతే ఏపీ ప్రగతికి దిక్సూచి. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 వేదికపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయమిది. 

సీఎం వైయ‌స్ జగన్‌ను చూసి గర్వపడుతున్నా..
పరిశ్రమల ఏర్పాటుకు సీఎం జగన్‌ ఎంత వేగంగా స్పందిస్తారో చెబుతూ సెంచురీ ప్లై చైర్మన్‌ సజ్జన్‌ భజాంకా చెప్పిన ఉదాహరణ ఆకట్టుకుంది. ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలి, అందుకోసం నోడల్‌ ఆఫీసర్ల నియామకంతోపాటు మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ఏఏ మోడల్స్‌ ఉత్పత్తి చేయాలి తదితర అంశాలన్నీ ఒక్క సమావేశంలోనే కొలిక్కి వచ్చేశాయన్నారు. తాను పుట్టిన నేలకు దేశ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గ­జా­లను తెచ్చిన సీఎం  జగన్‌ను చూసి గర్విస్తున్నా­నని జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ గ్రంథి మల్లికార్జునరావు చెప్పారు. జె ఫర్‌ జగన్‌ కాస్త జె ఫర్‌ జోష్‌గా మారిందని దాల్మియా భారత్‌ గ్రూప్‌ ఎండీ పునీత్‌ దాల్మియా వ్యాఖ్యానించారు.

విజనరీ సీఎం నేతృత్వంలో ముందడుగు
 – నవీన్‌ జిందాల్, జేఎస్‌పీఎల్‌ గ్రూప్‌ చైర్మన్‌
రాష్ట్ర ప్రగతిలో భాగ­స్వా­ములుగా మారు­తు­న్నందుకు చాలా సం­తోషంగా ఉంది. ఇన్‌ఫ్రా బేస్, వ్యాపార అనుకూల వాతావరణానికి రాష్ట్రం అనుకూలమైంది. విజనరీ లీడర్‌ షిప్‌తో ప్రోగ్రెసివ్‌ పాలసీ, పారిశ్రామిక అభివృద్ధి పాలసీ, ఇండస్ట్రీస్‌ ఎకోసిస్టమ్, పెట్టుబడిదారులకు అనుకూలమైన సింగిల్‌ విండో విధానాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు.

జిందాల్‌ గ్రూప్‌ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల్లోనూ వృద్ధిలోనూ ఏపీ ముందడుగు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 140 మెగావాట్ల యూనిట్ల ఉత్పత్తి ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నాం. కృష్ణపట్నం సమీపంలో రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 3 మిలియన్‌ టన్నుల  సామర్థ్యంతో 10 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేలా స్టీల్‌ప్లాంట్‌కు ఇటీవలే భూమి పూజ చేశాం. ఏపీకి యంగ్, డైనమిక్‌ లీడర్‌ వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నారు.

సీమపురి ఎనర్జీ ప్లాంట్‌ నుంచి 6 నెలల్లో 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించి అందించనున్నాం. కడప స్టీల్‌ప్లాంట్‌కు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ శంకుస్థాపన చేసింది. సోలార్, హైడ్రో, విండ్‌ పవర్, సిమెంట్‌ ప్రాజెక్టు ఎంవోయూలు కూడా ఏపీ ప్రభుత్వంతో చేసుకున్నాం. సమృద్ధిగా వనరులు, అపార అవకాశాలతో ఏపీ స్వర్గధామంలా ఉంది. సీఎం జగన్‌ నిరంతర శ్రమకు నిదర్శనంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా జీడీపీ వృద్ధి రేటులో ఏపీ అగ్రగామిగా ఉండటం శుభపరిణా­మం. 

 అపార వనరులున్న రాష్ట్రమిది 
– బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ అగ్రగామిగా ఉంది. సహజ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రమిది. వివిధ రంగాల్లో లాజిస్టిక్స్‌ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఆంధ్రప్రదేశ్‌లో కొదవలేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాపార, వాణిజ్య రంగాలపై మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నాం. 

 వేగంగా అనుమతులు.
– అమర్‌నాథ్, ఐటీ, పరిశ్రమల మంత్రి
రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తల­కు పుష్కల అవకాశాలు­న్నా­యి. పెట్టుబడులు పెట్టే పరి­శ్రమలకు అనుమతుల మంజూరులో ఎలాంటి జాప్యం లే­కుండా చర్యలు తీసుకుంటు­న్నాం. త్వరితగతిన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చిన మాది­రిగానే సీఎం నాయకత్వంలో రాష్ట్రానికి వచ్చే ప్రతి పరిశ్రమకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం.  

అభివృద్ధిలో భాగస్వాములవుతాం
 సీఎం వైయ‌స్ జగన్‌ సారథ్యంలో అభివృద్ధి పరుగులు..  జీఐఎస్‌లో దిగ్గజ పారిశ్రామికవేత్తల ప్రశంసలు
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయిస్తూ ఉపాధి కల్పనే లక్ష్యంగా విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 ఊహకు మించి అద్భుతంగా ఆరంభమైంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొనడం హైలెట్‌గా నిలిచింది.

ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఏ ఒక్క పెట్టుబడుల సదస్సుకు హాజరుకాని రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ 15 మంది బోర్డు డైరెక్టర్లు, వైస్‌ ప్రెసిడెంట్లతో కలసి విశాఖ సమ్మిట్‌లో పాల్గొనడం విశేషం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డైనమిక్‌ లీడర్‌షిప్‌పై ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రాభివృద్ధిలో తాము కూడా భాగస్వాములవుతామని ప్రకటించారు. పెట్టుబడులకు స్వర్గధామం లాంటి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు.   

 ఆరోగ్య రంగం అద్భుతం..  
– ప్రీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ వైస్‌ చైర్‌పర్సన్‌
సమృద్ధి అంటే మనం చూస్తున్నట్లుగా ప్రజల శ్రేయస్సు పరిపూర్ణంగా కనిపించడం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని ఈ భూమి తల్లి కుమార్తెగా చెబుతున్నా. వైద్యారోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు నిజంగా ప్రశంసనీయం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ఇతర దేశా­లకూ విస్తరించింది.

ఆ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మరింత విస్తరింపజేశారు. ఆరోగ్యశ్రీ ఆఫ్రికాలోనూ అమలవుతుండ­టం గర్వకారణం. ఏపీ ప్రభుత్వంతో అపోలో గ్రూప్స్‌ భాగ­స్వామి­గా ఉండటం సంతోషంగా ఉంది. అపోలో కార్యకలా­పా­లకు సీఎం జగన్‌ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. మన­మం­తా చూ­స్తున్నట్లుగా ఏపీవైపు అన్ని పరిశ్రమలు కలసి వస్తు­న్నాయి. రాష్ట్రంలో అత్యుత్తమ ఆరోగ్య ప్రమాణాలు అందించేందుకు ఒక కుటుంబంగా సహకరిస్తామని హామీ ఇస్తున్నా. 

 రూ.5 వేల కోట్ల పెట్టుబడులు 
– హరిమోహన్‌ బంగూర్, శ్రీ సిమెంట్‌
జీఎస్‌డీపీలో 11.43 శాతంతో అగ్రభాగంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ దేశ జీడీపీలో 5 శాతం వాటా సాధించినందుకు అభినందనలు తెలియచేస్తున్నా. సీఎం జగన్‌ కృషితో విద్య, సామాజిక, ఇంజనీరింగ్‌ రంగాల్లో పరిశ్రమల్ని ఆకర్షించే అద్భుతమైన వనరులున్న రాష్ట్రంగా ఏపీ అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాలతో పాటు మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్న రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్ది పారిశ్రా­మిక వర్గాల్ని ఆకర్షిస్తున్నారు. దాదాపు 50 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో శ్రీసిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశాం.

55 శాతం గ్రీన్‌ ఎనర్జీ వినియోగిస్తూ దేశంలోని సిమెంట్‌ ప్రాజెక్టుల్లో నంబర్‌ వన్‌గా ఉన్నాం. ప్లాంట్‌లు మరిన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. మా సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ ప్రాంతంగా భావిస్తున్నాం. రూ.3,000 కోట్లతో గుంటూరులో దేశంలోనే మొదటి గ్రీన్‌ సిమెంట్‌ ప్లాంట్‌ పనులు జరుగుతున్నాయి. రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టి 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్‌ నేతృత్వంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాం.

 ప్రభుత్వ సహకారంతో 18 నెలల్లోనే పూర్తి 
– సుమిత్‌ బిదానీ, కెనాఫ్‌ సంస్థ సీఈవో
పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని చెప్పేందుకు మేమే నిదర్శనం. శ్రీసిటీలో పరిశ్రమ ఏర్పాటుకు 2019లో ఒప్పందం కుదుర్చుకున్నాం. దేశంలోనే అతిపెద్ద  ప్లాంట్‌గా 40 మిలియన్‌ డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో 24 ఎకరాల్లో నిర్మించాం. 200 మందికి నేరుగా ఉపాధి కల్పించాం. సీఎం జగన్‌ సహకారం, ప్రోత్సాహంతో పెట్టుబడుల ఒప్పందం జరిగిన 18 నెలల్లోనూ మా ప్రాజెక్టుని పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాం.

ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని అనుమతుల్ని తేలికగా పొందాం. శ్రీసిటీలో విద్యుత్‌ సరఫరా చాలా అద్భుతంగా ఉంది. ముడిపదార్థాలు, ఇతర వస్తువుల్ని దిగుమతి చేసుకునేందుకు పలు పోర్టులు 100 కి.మీ. లోపు ఉండటం, బహుళ రహదారుల అనుసంధాన వ్యవస్థ కూడా ఉపయోగపడుతోంది. రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్‌ సౌకర్యం ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ పారిశ్రామికవేత్తలకు బాగా ఉపయోగపడుతుంది. 

 భవిష్యత్తు విస్తరణ ఏపీలోనే     
– సజ్జన్‌ భజాంకా, సెంచురీ ప్లై చైర్మన్‌
ఏపీలో 14 నెలల క్రితం మా కలల ప్రయాణం ప్రారంభమైంది. సీఎం జగన్‌ను మొదటిసారి కలసినప్పుడు మా ప్లాంట్‌ ఎలా ఎస్టాబ్లిష్‌ చేయాలనే ఆలోచనతో వెళ్లాం. ప్లాంట్‌ ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఏ మోడల్స్‌ ఉత్పత్తి చేయాలి? నోడల్‌ ఆఫీసర్లు ఎవరు..? ఇలా అన్నీ ఒక్క మీటింగ్‌లోనే డిసైడ్‌ అయిపోయాయి. అన్నీ కుదిరితే 2024 కల్లా ప్లాంట్‌లో ఉత్పత్తులు ప్రారంభించగలమని అనుకున్నాం.

సీఎం ప్రోత్సాహంతో కేవలం రెండేళ్లలోనే 2021 డిసెంబర్‌లో ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో మా ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, సులభంగా మారింది. ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత ఇది మా రాష్ట్రం, మా ప్రాంతం అనే భావనకు వచ్చేశాం. ప్రతి ఒక్క అధికారి, రాజకీయ ప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారు. మరో రెండు ప్లాంట్ల పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఏపీని మా ఫస్ట్‌ చాయిస్‌గా మార్చేశారు.

 రూ.10 వేల కోట్లకు కియా పెట్టుబడులు 
– కబ్‌ డాంగ్‌లీ, కియా మోటర్స్‌
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రపంచ స్థాయి ఆటోమొబైల్‌ ప్లాంట్‌ నిర్మించాం. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు మరువలేనిది. ఇండియన్‌ ఆటోమొబైల్‌ రంగంలో కియా ఇండియా లీడింగ్‌ కంపెనీగా మారడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో ఉంది. 2023 చివరి నాటికల్లా ఈవీ–6 తయారు చేస్తాం.

ఏపీలో 2027 నాటికల్లా కియా పెట్టుబడులు రూ.10 వేల కోట్లకు చేరుకోనున్నాయి. నిరంతర విద్యుత్, స్కిల్డ్‌ మానవ వనరులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అందించారు. కోవిడ్‌ సమయంలో మా ఉద్యోగులు, ముడి సరుకులను తరలించడంలో సీఎం జగన్‌ ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞతలు. రాష్ట్రంలోని సుదీర్ఘ తీరం వెంట పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాల్ని వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నా.

 ప్రభుత్వ సహకారానికి సాహో 
– మసహిరో యమగుచీ, టోరే ఇండస్ట్రీస్‌ ఇండియా లిమిటెడ్‌ ఎండీ
శ్రీసిటీలో ప్లాంట్‌ ఏర్పాటు సమయంలో సీఎం జగన్‌ సహకారం మరువ­లేనిది. అనుమతులన్నీ అతి తక్కువ సమయంలోనే మంజూరు చేశారు. ఫస్ట్‌ ఫేజ్‌లో 2019లోనే ఉత్పత్తులు ప్రారంభించాం. రెండో ఫేజ్‌లో రూ.200 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్‌ను అభివృద్ధి చేసి ఉత్పత్తుల్ని ఈ ఏడాది మొదలు పెట్టాం.

ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, బయో, నానో­టెక్నాలజీ, పాలిమర్‌ కెమిస్ట్రీ కోర్‌ టెక్నాలజీతో ప్రారంభిస్తున్నాం. శ్రీసిటీలో హైక్వాలిటీ ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తున్నాం. 132 కేవీ విద్యుత్‌ లైన్‌ని ప్రత్యేకంగా మాకోసం అందించారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ అద్భుతంగా అమలు చేస్తున్నారు.

 స్టార్టప్, గ్రీన్‌ ఎనర్జీపై ఆసక్తి.. 
– మార్టిన్‌ ఎబర్‌హార్డ్, టెస్లా కో ఫౌండర్‌
టెస్లా ప్రారంభించినప్పుడు ఎవరికీ ఎలక్ట్రిక్‌ కార్లు తయారు చేస్తారనే ఆలోచన లేదు. ఈ రోజు ప్రతి దిగ్గజ కార్ల కంపెనీకి ఈవీ కార్ల గురించి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్టార్టప్‌ కంపెనీలకు గొప్ప ఎకో సిస్టమ్‌ ఉంది. ఏపీలో స్టార్టప్స్‌తో పాటు గ్రీన్‌ఎనర్జీ ఉత్పత్తి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో సదస్సుకు హాజరయ్యా.

ఈవీ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. గ్రీన్‌ రివల్యూషన్‌కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టార్టప్‌ కంపెనీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు ఒక్కటే చెబుతున్నా.. ఓడిపోయామని వదలొద్దు.. విజయం సాధించే వరకూ అడుగులు వేస్తూనే ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌లో సమృద్ధిగా వనరులు
  ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు సమృద్ధిగా ఉన్నాయని పరిశ్రమల శాఖ, ఆంధ్రప్రదేశ్‌ మారిటైం బోర్డు అధికారులు విదేశీ ప్రతినిధులకు వివరించారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం మ.3 గంటలు తరువాత యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, నెదర్లాండ్స్‌ దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సెషన్‌ నిర్వహించారు.

ఇందులో పరిశ్రమలు, మారిటైం బోర్డు అధికారులు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ఇక్కడ వర్క్‌ఫోర్స్, ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్రోత్సాహకాలను వారికి విశదీకరించారు. ముఖ్యంగా దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు పోర్టులను సైతం నిర్మిస్తోందని వివరించారు.

అలాగే, నెదర్లాండ్స్‌లో పోర్టుల నిర్మాణాలు, వాటి నిర్వహణకు గల అవకాశాలను ఆ దేశ ప్రతినిధులు ఇక్కడి డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌తో పాటు అదాని, ఇతర ప్రైవేటు సంస్థ ప్రతినిధులకు వివరించారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయిలో సమీక్ష జరిపి వ్యాపార అవకాశాలపై నిర్ణయం తీసుకుంటామని నెదర్లాండ్స్‌ ప్రతినిధులు తెలిపారు. 

9 రంగాలపై సెమినార్లు 
 విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో పలు రంగాలలో మొదటి రోజు సెమినార్లు జరిగాయి. వీటిలో ప్రధానంగా రెన్యువబుల్‌ ఎనర్జీ అండ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ (పునరుత్పాదక శక్తి), ఆరోగ్య భద్రత – వైద్య పరికరాలు, ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్, ఐటీ, ఆటోమేటివ్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్‌ అండ్‌ లాజిస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్‌ ఇన్నోవేషన్స్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ ప్రోసెసింగ్‌ రంగాల్లో సెమినార్లు నిర్వహించారు.

 
పారిశ్రామికవేత్తలకు మంత్రులు, అధికారులు ప్రభుత్వ విధానాలను వివరించారు . ఏపీ ప్రభుత్వం అందించే అవకాశాలతో పాటు ఇక్కడ విస్తారంగా ఉన్న భూమి, వనరులు, నైపుణ్యం కలిగిన యువత, పుష్కలంగా నీటి లభ్యత, నిరంతర విద్యుత్‌ సరఫరాను వివరించారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని తెలిపారు. 

ఆరోగ్య భద్రత – వైద్య పరికరాలు 
‘ఆరోగ్య భద్రత – వైద్య పరికరాలు’ రంగంపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని హాజరయ్యారు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ఆమె  వివరించారు. ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు, కార్పొరేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 95 శాతం ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. రాష్ట్రంలోని 2,200 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ద్వారా 3,200 రోగాలకు వైద్యం అందిస్తున్నాం.

పార్లమెంట్‌ నియోజకవర్గానికో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. వైద్య విభాగంలో పెట్టుబడులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది’ అని మంత్రి వివరించారు.  దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన మణిపాల్‌ ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో దిలీప్‌ జోష్, ఉస్మానియా వైద్య నిపుణులు గురునాథ్‌రెడ్డి, ఎయిమ్స్‌ హెచ్‌వోడీ ముకేష్‌ త్రిపాఠి తదితరులు క్వాలిటీ హెల్త్‌ సిస్టమ్, ప్రైవేట్‌ సెక్టార్‌ హెల్త్‌ కేర్, వైద్య రంగం ద్వారా వచ్చే రెవెన్యూ, ఉద్యోగావకాశాలు, ఇమేజింగ్‌ హెల్త్‌ కార్డ్‌ డెలివరీ, కమ్యునికబుల్, నాన్‌ కమ్యునికబుల్‌ డిసీజస్‌ అనే అంశాలపై మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు అందిస్తున్న ‘ఫ్యామిలీ ఫిజిషియన్‌’ విధానాన్ని, ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ తెలుగువారికి అందిస్తున్న ఉచిత వైద్యాన్ని ప్రశంసించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. 

పునరుత్పాదక ఇంధన శక్తి 
రెన్యువబుల్‌ ఎనర్జీ అండ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ (పునరుత్పాదక ఇంధన శక్తి) రంగంలో పెట్టుబడిదారులతో రాష్ట్ర ఇంధన శక్తి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె.విజయానంద్‌ ఆధ్వర్యంలో సెమినార్‌ నిర్వహించారు. ముఖ్య అతిథి రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన శక్తి రంగంలో పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు.

ఈ రంగంలో పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే సదుపాయాలు, ఆర్‌పీవో ప్రయోజనాలను వివరించారు. ‘2030 నాటికి ఏపీలో 500 కేటీపీఏ గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి ప్రభుత్వ లక్ష్యం. 10 నుంచి 15 బిలియన్‌ డాలర్ల గ్రీన్‌ఎనర్జీ అవకాశాలు ఏపీలో ఉన్నాయి. 38 జీడబ్ల్యూ సోలార్, 44 జీడబ్ల్యూ విండ్, 34 జీడబ్ల్యూ హైడ్రో ప్రాజెక్టులకు అవకాశాలు­న్నాయి.  974 కిలోమీటర్ల తీర ప్రాంతం, 6 పోర్టులు, ఇతర రాష్ట్రాలతో పోల్చితే 45% ఎకనామికల్‌ వాటర్‌ సదుపాయం ఏపీలో ఉన్నాయి.  నిపుణులైన మానవ వనరులు కూడా అందుబాటులో ఉన్నాయి’ అని పెద్దిరెడ్డి వివరించారు.  

Back to Top