రైతన్నా నీకు నేనున్నా

*అన్నదాతకు అండగా జననేత 
*రైతు సమస్యలు పట్టని చంద్రబాబు
*మద్దతు ధర విషయంలో మొద్దు నిద్ర
*చంద్రబాబు సర్కార్ మెడలు వంచేందుకు వైయస్ జగన్ దీక్ష
*రైతుల పక్షాన గుంటూరులో మే 1,2 తేదీల్లో దీక్ష
*దీక్షకు తరలుదాం...జయప్రదం చేద్దాం

గుంటూరుః రైతు సమస్యలపై వైయస్సార్సీపీ మరోమారు పోరుబాట పట్టింది.  మద్దతు ధర విషయంలో మొద్దు నిద్రపోతున్న సర్కార్ ను తట్టిలేపేందుకు వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గుంటూరు వేదికగా రైతు దీక్ష చేపడుతున్నారు. నల్లపాడు రోడ్డులోని మిర్చీ యార్డు సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో వైయస్ జగన్ దీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైయస్ జగన్ మే 1, 2 తేదీల్లో రెండ్రోజుల పాటు దీక్ష చేస్తారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం మెడలు వంచనున్నారు. అన్నదాతలపై ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ రైతుల పక్షాన వైయస్ జగన్ మొదటి నుంచి పోరాటం కొనసాగిస్తున్నారు.  

అసలే కరువుతో బక్కచిక్కిన రైతన్న... తాను పండించిన కొద్దిపాటి పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మరింతగా కుదేలయ్యాడు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ పుట్ సబ్సిడీ అందక, రుణాలు మాఫీ గాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం  చోద్యం చూస్తోంది.  రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని చెప్పిన చంద్రబాబు..ఏ నిధి లేకుండా చేసి అన్నదాతను వంచనకు గురిచేశాడు.  వరి, మిర్చీ, పసుపు ఇలా అన్ని పంటలదీ అదే దుస్థితి. కనీస మద్దతు ధర లేకపోవడంతో అన్నదాత కాకవికలమవుతున్నాడు.  

ధరల పతనంతో ఇటీవలే ఇద్దరు మిర్చీ రైతుల ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రతిపక్ష నేతను తీవ్రంగా కలచివేసింది. స్వయంగా వైయస్ జగన్ మిర్చీ యార్డుకు వెళ్లి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతులు ఉంటే...ప్రభుత్వంలో కనీస స్పందన లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని కోరినా చలనం లేకపోవడంతో చంద్రబాబు సర్కార్ మెడలు వంచేందుకు వైయస్ జగనే నేరుగా రంగంలోకి దిగారు.  దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. రైతుల కోసం వైయస్ జగన్ చేస్తున్న ఈ దీక్షకు రాజకీయాలకతీతంగా అందరూ తరలివచ్చి  జయప్రదం చేయాలని, రైతుల పట్ల ప్రభుత్వ నిరంకుశ ధోరణి, మొండివైఖరిని ఎండగడుదామని వైయస్సార్సీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. 
Back to Top