ముందే పండ‌గొచ్చింది

   
- వైయ‌స్ జ‌గ‌న్ జన్మదిన వేడుకలు ప్రారంభం
- ఒక రోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పుట్టిన రోజు వేడుక‌లు

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ముందే పండ‌గొచ్చింది. ఆ పండుగ ఏంటో తెలుసా..త‌మ అభిమాన నేత‌..రాష్ట్రానికి కాబోయే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన‌మే. నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం తపించే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు ఒక రోజు ముందుగానే ఘనంగా జరుపుకుంటున్నారు. డిసెంబర్‌ 21 జననేత పుట్టిన రోజు కావడంతో.. ఒకరోజు ముందుగానే అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను ప్రారంభించారు. రాష్ట్రంలోని పలుచోట్ల కేక్‌లు కట్‌చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌న్మ‌దిన వేడుక‌ల‌ సంద‌డి మొద‌లైంది. పార్టీ శ్రేణులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు.


తాడిపత్రిలో వృద్దులకు దుస్తుల పంపిణీ..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో శ్రీ కృష్ణ వృద్దాశ్రమంలో వైయ‌స్‌ జగన్‌ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌రెడ్డి వృద్దాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలోని వృద్దులకు దుస్తులు పంపిణీ చేశారు.

వైజాగ్‌లో భారీ కేక్‌ కట్‌ చేసిన పార్టీ శ్రేణులు
వైయ‌స్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా వైజాగ్‌లోని మనోరమ జంక్షన్‌లో  వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ రమణ మూర్తి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బారీ కేక్‌ కట్‌ చేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ  వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ  మహిళా విభాగం కన్వీనర్‌ గరికిన గౌరి, వార్డు అధ్యక్షురాలు భారతిలు పాల్గొన్నారు.

విజయవాడలో మెడికల్‌ క్యాంపు..
జననేత వైయ‌స్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం వద్ద   వైయ‌స్ఆర్‌సీపీ   నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, తనుబుద్ది చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మెగా మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ల చేతుల మీదుగా ఈ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో   వైయ‌స్ఆర్‌సీపీ నేతలు రక్షణ నిధి, జోగి రమేశ్‌, ఇక్బాల్‌, ఉదయభాను, మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్‌, అసిఫ్‌, తోట శ్రీనివాస్‌, ఎంవీఆర్‌ చౌదరి, అరిమండ వరప్రసాద్‌రెడ్డిలు పాల్గొన్నారు.

 



తాజా వీడియోలు

Back to Top