అక్క‌చెల్లెమ్మ‌ల హ‌ర్షం-  అక్క‌చెల్లెమ్మ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ అరుదైన కానుక‌లు
- వైయ‌స్ జ‌గ‌న్ హామీల‌పై మ‌హిళ‌ల సంతోషం 
అమ‌రావ‌తి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్ఫూర్తితో మ‌హిళ‌ల‌ను ల‌క్షాధికారుల‌ను చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మ‌హిళ‌ల‌కు ల‌బ్ధి చేకూర్చేందుకు న‌వ‌ర‌త్నాలు వంటి ప‌థ‌కాల‌లో పెద్ద పీట వేశారు. మ‌హిళ‌ల‌ను ఆదుకునేందుకు తాను ఏం చేయ‌బోయే కార్య‌క్ర‌మాల‌ను నిన్న‌టి కురుపాం బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న‌న్న రావాల‌ని..న‌వ‌రాత్నాలు కావాల‌ని నిన‌దిస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, మాఫియాలు, మోసాలతో సాగుతున్న పాలనకు చరమగీతం పాడేది వైయ‌స్ జ‌గ‌న్ మాత్ర‌మే అంటున్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌ సంక్షేమ పాలనకు స్వాగతం పలుకుతామ‌ని అక్క‌చెల్లెమ్మ‌లు ముక్త‌కంఠంతో చెబుతున్నారు.  వచ్చే ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌కు అండగా నిలుద్దామని, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుకుందామంటున్నారు. ‘నవరత్నాలతో’ జీవితాలు బాగుచేసుకుంటామ‌ని విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు.  

మ‌హిళ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన హామీలు ఇలా..
- ఎన్నికల తేదీ నాటి వరకు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మల రుణాలు ఎంతైతే ఉన్నాయో ఆ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తాం. అక్కచెల్లెమ్మలకు మళ్లీ వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. ఆ వడ్డీ సొమ్మును ప్రభుత్వమే కడుతుంది.   
- ఇవాళ కార్పొరేషన్ల పరిస్థితి దారుణంగా ఉంది. రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. సబ్సిడీ సొమ్ము కూడా అరకొరగా ఉంటోంది. వైఎస్సార్‌ చేయూత పథకాన్ని తెచ్చి కార్పొరేషన్‌ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని ప్రతి అక్క గ్రామ సచివాలయానికి వెళ్లి వైయ‌స్ఆర్‌ చేయూత పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెండో సంవత్సరం నుంచి నాలుగు దఫాలుగా నాలుగు సంవత్సరాల్లో రూ.75,000 ఇస్తాం. ఇది అప్పుగా కాదు.. ఉచితంగా ఆ అక్కల చేతిలో పెడతాం.  
- మీ చిట్టి పిల్లలను బడులకు పంపిస్తే ప్రతి అక్కకూ.. ప్రతి చెల్లికీ ఏటా రూ.15,000 ఇస్తాం. ఏబడికి పంపించినా çఫరవాలేదు.  
- మీ పిల్లలను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నేను చదివిస్తానని హామీ ఇస్తున్నాను. ఎంత ఖర్చు అయినా çఫరవాలేదు. మీ పిల్లలు ఇంజినీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి ఏ చదువులు చదవడానికైనా హాస్టల్‌లో ఉండాల్సి వస్తుంది. వారి ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాం.  
- గ్రామాల్లో ఏ పథకం కావాలన్నా లంచాలివ్వాల్సిన పరిస్థితి ఉంది. అందుకే మీ గ్రామంలోనే గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. మీ గ్రామానికి చెందిన పది మందికి ఉద్యోగాలిచ్చి అక్కడ కూర్చోబెడతాను. ఏ పథకం కావాలన్నా.. మీరు దరఖాస్తు చేసిన 72 గంటల్లో మంజూరు చేస్తాం. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదు.  
- 60 ఏళ్లు నిండిన ప్రతి తల్లికీ ఇచ్చే పింఛన్‌ రూ.2000 చేస్తాను.  
- ప్రతి పేదవాడికీ ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తాను. ఆ ఇంటిని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను. వారికి ఏదైనా అవసరానికి డబ్బు కావాల్సి వస్తే ఆ గృహపత్రాలు తీసుకుని బ్యాంకుకు వెళ్లి పావలా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం.
- 2024 సంవత్సరంలో నేను మళ్లీ మిమ్మల్ని ఓటు అడిగే నాటికి మద్యం షాపులు లేకుండా చేస్తాను.  

Back to Top