ఇసుక అక్రమ దందా

  • అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండ
  • చోద్యం చూస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు

విజయనగరం: జిల్లాలో ఇసుక అక్రమ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇసుకను అక్రమ రవాణా చేసి  అక్రమార్కులు కోట్లు కొల్లగొడుతున్నారు.  ఇంత జరుగుతున్నా..రెవెన్యూ, పోలీస్‌ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండంతో ఇసుకాసురుల దందాకు అడ్డుఅదుపు లేకుండ పోయింది నిర్దేశించిన, గుర్తించిన ర్యాంపులలో నుంచి కాకుండ  నిషేదించిన ర్యాంపులోను, మంచినీటి పథకాల వద్ద ఉన్న ఇసుకను అక్రమంగా తరలిన్తున్నారు. లారీ, ట్రాక్టర్‌ యాజమానులుకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో పగలు, రాత్రిలు విరామం లేకుండ పట్టణ ప్రాంతలకు ఇసుకను తరలిస్తున్నారు. 

 గుర్ల మండలంలోని గుర్ల, కలవచర్ల, చింతలపేట, ఆనందపురం, చంపావతి నది పరివాహక ప్రాంతలలో నిషేదం ఉన్నప్పట్టికి ఇసుకాసురులుతో కొందరు అధికారులు లాలుచీ పడి ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నారు. చంపావతి నదీ తీరంలో అనుమతులు లేని రీచ్‌లలో తమ  ఇష్టానుసారం త్రవ్వకాలు జరిపి రోజుకు 200 క్యూబిక్‌ మీటర్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.  ఇలా తరలించిన  ఇసుకను ఒక దగ్గర దిబ్బలు(స్టాక్‌)వేయడానికి, రాత్రి వేళల్లో ఇసుకను తరలించడానికి అనుమతులు లేకపోయినప్పటికీ ఆ సమయంలో పెద్ద మొత్తంలో స్టాకును ఏర్పరుచుకోని లారీల ద్వారా విజయనగరం, విశాఖపట్నంకు తరలిస్తున్నారు. పంపుసెట్ల వద్ద ఇసుకను తీసివేయడంతో రైతులు పండిస్తున్న మొక్కజొన్న, చోడి పంటలకు నీరు అందక పైర్లు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
 
Back to Top