రియల్ ఎస్టేట్" రాజధాని


ప్రపంచంలో ఎన్నో గొప్ప రాజధానులు ఉన్నాయి. మహా మహా నగరాలు ఉన్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ ఉంది. కానీ ప్రపంచంలో    ఎక్కడా లేనట్టు ఆంధ్ర ప్రదేశ్ రాజధానిలో రియల్ ఎస్టేట్ మాత్రమే ఉంది. రాజధానిని నిర్మిస్తూ లేదా నిర్మించాక ఆ చుట్టుపక్కల అంతా రియల్ ఎస్టేట్ విస్తరిస్తుంది. కానీ ఏపీలో మాత్రం రియల్ ఎస్టేట్ విస్తరించాకే రాజధాని నిర్మాణం అవుతుందిట. ఇది బాబు గారి విజన్. రాజధాని కడతాను భూములు ఇస్తారా ఛస్తారా అని వేల ఎకరాలు సమీకరించిన చంద్రబాబు ఇప్పుడు వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అందుకే ఎంతోమంది బాబును సీఎం కాదు సీఈవో అంటారు. నాయకుడిగా కాక వ్యాపారిగా వ్యవహారాలు నడపడమే అందుకు కారణం. ఇప్పుడు కూడా రాజధాని భూములను తాకట్టు పెట్టి, ప్లాట్లు కట్టి, వెంచర్లు వేసి ఆ డబ్బులతో రాజధాని నిర్మిస్తా అంటున్నాడు. అంటే ప్రజలు తమ భూములను త్యాగం చేస్తే బాబు వాటితో వ్యాపారం చేస్తాడన్నమాట. 

రాజధాని భూముల విలువ పెరిగింది అంటున్నాడు చంద్రబాబు. నిజానికి విలువైన భూములను చంద్రబాబు రాజధాని కోసం అంటూ సమీకరించాడు. అరకొర నష్టపరిహారంతో రైతులను మోసగించాడు. ఇక ఆ పార్టీ నాయకులు అయితే బాబుగారి ముందస్తు ప్రణాళిక ప్రకారం రాజధాని పరిసరాల్లో వేలాది ఎకరాల భూములను కారుచౌకగా కొనుక్కున్నారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ చేసి అమాంతంగా భూముల విలువ పెరిగేలా చేసింది చంద్రబాబే. 

ఇప్పటికే ఫ్లాట్ల కోసం 50 ఎకరాలు కేటాయించారు. వీటి కోసం ఆన్లైన్ దరఖాస్తులు కూడా అందుకున్నారు. ఐదువేల ప్లాట్లు కడతారట. ఇంకా ఎవరైనా రాజధాని వచ్చి స్థిరపడాలనుకునే ఇళ్లు కట్టించి ఇస్తారట. ప్రజలు ఎవరైనా రాజధానిలో నివసించాలని కోరుకుంటారు. కానీ రాజధాని లేకుండానే ఇళ్లు కట్టించి ఇస్తాను అంటున్నాడు చంద్రబాబు. రాజధాని నిర్మాణంలో ముఖ్యమైన భవనాల నమూనాలు ఖరారు అయ్యాయో లేదో తెలియదు. కట్టిన 2 తాత్కాలిక భవనాలు చిరుగాలికి చిన్ని వానకు వణికిపోతున్నాయి. ఇప్పుడు కడుతున్నామని చెబుతున్న జ్యుడీషియల్ భవనాల పరిస్థితి ఏంటో రేపు కోర్టు సిబ్బంది, జడ్జీలు వచ్చాక తెలుస్తుంది. పరిపాలన భవనాలు లేవు. శాశ్వత కట్టడాలు లేవు. మౌలిక వసతులు లేవు. కనీస సౌకర్యాలు లేవు. కానీ రాజధాని పేరు మాత్రం ఉంది. అమరావతిలో ఆనందం, ఆయువు అన్ని ఉంటాయట. కానీ ఆ రాజధాని మాత్రమే ఉండదట. బాబు జిమ్మిక్కులకు అంతులేదు.

రాజధానిలో భూముల ఇష్టారాజ్యం వ్యవహారం పై ప్రతిపక్షాలు అనుక్షణం ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నాయి. రైతుల భూములను రాజధాని నిర్మాణాల కోసం కాకుండా వ్యాపార సంస్థలకు, రియల్ ఎస్టేట్కు వాడటాన్ని అభ్యంతర పెడుతూనే ఉన్నాయి. కానీ బాబు తన వ్యాపార పంధా మార్చుకోలేదు. రాజధానిలో పేదలకు 500 ఎకరాలు ఇస్తానంటూ ఆశ పెట్టడం ఇందులో మరో కొత్త మెలిక. దాని వెను వెంటనే మిగిలిన భూములను అమ్ముతాను అని కూడా ప్రకటించాడు ఈ వ్యాపార ముఖ్యమంత్రి. రాజధానికి వేల ఎకరాలు అవసరం ఏముంటుంది అని పరిశీలకులు మేధావులు ప్రశ్నిస్తే, విశాలమైన రాజధాని నగరం అని చెప్పిన బాబు దానికి బదులుగా భూముల అమ్మకాలు, తాకట్టులు, రియల్ ఎస్టేట్ లపైనే మక్కువ చూపుతున్నాడు. 
ఇది బాబు మార్క్ దగా రాజకీయం. రియల్ రాజధాని పేరుతో బాబు చేస్తున్న రియల్ ఎస్టేట్ అరాచకీయం.

Back to Top