ప్రశ్నిస్తూ.. సమాధానాలు రాబడుతూ..

మహబూబ్‌నగర్:

ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కుందా అంటే లేదనే అంటున్నారు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల. మహానేత డాక్టర్ వైయస్ఆర్ రైతులను ఎంతో ప్రేమించారనీ, తన పాలన కాలంలో అన్ని విధాలా ఆదుకున్నారనీ ఆమె చెబుతూ.. ఇప్పటి పరిస్థితిని కళ్ళకు కట్టేలా వివరించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల ప్రజలను ఆకట్టుకునేలా ప్రతి అశాన్నీ విశ్లేషించి చెబుతున్నారు.   
‘కష్టించి పండించిన పంటకు మద్దతుధర కోసం రైతన్న లు రోడ్డెక్కితే వారి సమస్యలను పరిష్కరించాల్సిన ఈ ప్రభుత్వం జిల్లాలో 45మంది రైతుల పై కేసులు నమోదు చేసి జైల్లోపెట్టింది. ఇలాం టి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు. ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తప్పదని’ ఆమె స్పష్టంచేశారు. ‘ పనులు లేక జిల్లా ప్రజలు కుటుంబాలను వదలి కూలి కోసం ఇతర ప్రాం తాలకు నెలలకొద్దీ వలసలు వెళ్తుంటారని చెబు తూ నాన్న ఎప్పుడూ బాధపడేవారు. అందుకే అలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలనే ఉ ద్దేశంతోనే మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి జి ల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కొత్తగా నాలుగు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారని అన్నప్పుడు ప్రజలు పెద్దఎత్తున హర్షాధ్వానాలు చేశారు.

నాటి పరిస్థితి ఇప్పటికి భిన్నం

     పాదయాత్ర ఆది వారం లాల్‌కోట గ్రామం నుంచి దేవరకద్ర వ రకు కొనసాగింది. వైయస్ హయాంలో పరిస్థితి ఎలా ఉందని శ్రీమతి షర్మిల ఓ అవ్వను ప్రశ్నించి సమాధానాన్ని రాబట్టారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎలాగుందో కూడా చెప్పాలని రచ్చబండలో ఆమెను అడిగినపుడు ‘ఆ మహానుభావుడు ఉన్నప్పు డు బ్యాంకు అప్పులన్నీ తీరిపోయాయనీ, కరెంట్ కూడా ఏడు గంటలు వచ్చేదనీ, పంటకు రేటు కూ డా బాగా వచ్చేదనీ ఆ ముసలవ్వ చెప్పింది.  వైయస్ మరణం తరువాత క రెంట్ 2, 3 గంటలకు మించి రావడం లేదనీ గి ట్టుబాటు ధర లేక అప్పుల పాలవుతున్నామనీ ఆవేదన వెలిబుచ్చింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రుణమాఫీ చేయడంతో రైతులంతా అప్పులబాధ నుంచి బయటపడ్డారన్నారు. నా ఒక్కనికే రూ.2.30 లక్షల బ్యాం కు అప్పు మాఫీ అయ్యిందంటూ మరో రైతు గుర్తుచేసుకున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు లాల్‌కోట గ్రామానికి చెందిన పలువురు రైతులు మహానేత పా లనను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. వారందరికీ శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. ‘ఎవరూ భయపద్దనీ, జగనన్న ముఖ్యమంత్రయిన తరువా త ఈ ప్రాంత రైతాంగాన్ని, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రామన్‌పాడు, కోయిల్‌సాగ ర్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాడనీ తెలిపి ముందుకు కదిలారు.

Back to Top