ఇలా కూడా మోసం చేయవచ్చా చంద్రబాబూ

చంద్రబాబుకి రైతులంటే గిట్టదు. వ్యవసాయం అంటే దండగ అన్నది ఆయన అభిప్రాయం. అందుకే వ్యవసాయ దారుల సమస్యలు అంటే ఆయన పెద్దగా పట్టించుకోరు. కాసులు,కమీషన్లు రాల్చే కార్పొరేట్ వ్యవహారాల మీదనే ఆయనకు మోజు.

వచ్చే సోమవారం నుంచి నీరు..ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా నీటి పారుదల శాఖ అదికారులు, సిబ్బందితో కలసి గ్రామాల్లో పర్యటించాలని, రైతుల్ని చైతన్యపరచాలని ఆదేశించింది. ఈ చైతన్య యాత్ర పేరు చెబితే అధికారులు జడుసుకొంటున్నారు.

గడచిన కొంత కాలంగా నీటి పారుదల ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో నీటిపారుదల శాఖకు చాలా ప్రాధాన్యం ఉండేది. అప్పట్లో జలయజ్నం రాష్ట్రమంతా ప్రభావితం చూపేది. రైతులకు మెరుగైన దిగుబడి అందాలంటే నీటిపారుదల చాలా ముఖ్యమని ఆయన బావించేవారు. అందుకు అనుగుణంగా కేటాయింపులు, పర్యవేక్షణ ఉండేది.

తర్వాత కాలంలో పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు పదవిలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా దిగజారి పోయింది. నీటిపారుదల శాఖను పూర్తి గా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో పంట పొలాలకు నీటిని సరఫరా చేసే వ్యవస్థలు బాగా చతికిల పడ్డాయి. చాలా కాలంగా ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయటం లేదు. పైగా డిప్యూటేషన్ల మీద ఇతర శాఖలకు పెద్ద ఎత్తున పంపిస్తున్నారు. నీటిపారుదల శాఖను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో ప్రాధాన్యత గల శాఖలకు పైరవీలు చేయించుకొని వెళుతున్నారు. ఇటు, చిన్ననీటి పారుదల కు గుండె కాయ వంటి లష్కర్ వంటి పోస్టులను అసలు పట్టించుకోవటం లేదు. చెక్ డ్యామ్ ల నుంచి గ్రామ గ్రామానికి నీటిని వదిలే లష్కర్ ఉద్యోగాలు మూడో వంతు ఖాళీ ఉన్నాయి. దీంతో ఎగువ భాగం నుంచి నీరు వచ్చినా దాన్ని సక్రమంగా అదుపు చేస్తూ పంట పొలాలకు తరలించటం కుదరటం లేదు. దీంతో నీరు కాల్వల్లోనే ఇంకిపోతోంది. పొలాలు చూస్తే ఎండిపోతున్నాయి.

 ఈ పరిస్థితుల్లో రైతుల దగ్గరకు వెళ్లాలంటే ఇంజనీరింగ్ అధికారులు భయపడుతున్నారు. చంద్రబాబు చేస్తున్న చిత్ర విచిత్ర మోసాలకు తామెందుకు రైతులతో తిట్టించుకోవాలని వాపోతున్నారు. అందుకే ఎక్కడికక్కడ ఆఫీసుల్లోనే మొక్కుబడిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి బయట పడాలని భావిస్తున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top