ఎన్నికల ’క్రీడలు’

క్రీడా పాలసీపై తాజాగా జీవో జారీ చేసింది చంద్రబాబు సర్కార్. ఇదేదో క్రీడల మీద సడన్ గా పుట్టుకొచ్చిన ప్రేమ అనుకుంటే పొరపాటు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగులను తీసుకునే విధి విధానాలపై ఈ జీవో జారీ చేసారు. ఇందుకోసం 20 క్రీడలను ఎంపిక చేసారు.ఈ ఆటలకు  విద్యారంగం, ప్రభుత్వ రంగం, లోకల్ బాడీ ఉద్యోగ రిజర్వేషన్లకు అర్హత ఉంటుందని ప్రకటించారు. క్రీడలనే ప్రోత్సహించని పాలనలో, కనీసం స్టేడియంలు కూడా లేని రాష్ట్రంలో క్రీడా రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వెనుక  క్రీనీడలు, ఎన్నికల క్రీడలూ ఉన్నాయి. అయినా కనీసం స్టేడియం లేకుండా, ఉన్న వాటికి కనీస మరమత్తులు చేయకుండా, క్రీడా విభాగానికి కనీస నిధులు కూడా ఇవ్వని పాలనలో యువత క్రీడల పట్ల ఆసక్తి ఎలా చూపగలదు? మెడల్స్ తెచ్చి రిజర్వేషన్ కోటాలు ఎక్కడ పొందగలదు?
ఆంధ్రప్రదేశ్ లో ఒలంపిక్స్ నిర్వహిస్తాం అని గొప్పలు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  ఒలంపిక్స్ మాట అటుంచి రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణం ఒక్కటి కూడా లేదు.  ఈ దిశగా ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ శూన్యం. పాత స్టేడియంల అభివృద్ధికానీ, కొత్తవాటి ఊసుగానీ ఈ నాలుగున్నరేళ్లలో లేదు. టీడీపీ హయాంలో రాజకీయ క్రీడలు తప్ప అసలు క్రీడాకారులకు ప్రోత్సహాం ఉండదని విమర్శలు ఉన్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని స్టేడియం కూడా వైఎస్ హయాంలో పునాదిరాయి పడ్డదే. క్రీడారంగానికి రాజధానిలో 1200 ఎకరాలు కేటాయించామని ప్రభుత్వం చెబుతోంది. అప్పుల కోసం తాకట్టులు పెట్టి, సింగపూరు కంపెనీలకు వెంచర్ల చేసేందుకు ఇవ్వగా మిగిలితే కదా క్రీడా రంగానికి కేటాయించిన ఆ 1200 ఎకరాలూ దక్కేది అని నిరాశపడుతున్నారు ఎపి క్రీడాకారులు. అయినా రాజధాని పేరు తప్ప నిర్మణామే కనిపించిన అమరావతిలో ఎన్నిఎకరాలు ఇస్తే మాత్రం ఏంలాభం అని పెదవి విరుస్తున్నారు బాబు తత్వం తెలిసిన మరికొందరు. 2017 బడ్జెట్ లో క్రీడలకు కేటాయించిన 200 కోట్లు ఏమయ్యాయో కూడా తెలియదంటున్నారు క్రీడారంగ అధికారులు. ఎపిలో క్రీడల దుస్థితి ఇలా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాదాసీదా క్రీడలు పనికిరావు. రాజకీయ చదరంగం, కాసులు రాశులు పోసే ఫార్ములా రేసుల మీదే మక్కువ ఎక్కువ. తాజాగా కృష్ణా నదిలో నిర్వహించిన ఊ1ఏ2ౖ బోట్ రేసులే అందుకు ఉదాహరణ.  
 
Back to Top