కిరికిరి బాబు హామీల కథలు-1

చంద్రబాబు రంగులకలల్లాంటి హామీలిస్తాడు. రాజమౌళి గ్రాఫిక్స్ లాంటి సినిమా చూపిస్తాడు. జేమ్స్ బాండ్ తానే అన్నంత బిల్డప్ ఇచ్చేస్తాడు. కానీ వాస్తవం చూస్తే కలలు తెల్లారిపోతాయి. గ్రాఫిక్స్ కనుమరుగైపోతాయి. బిల్డప్ అంతా బిజినెస్ అని అర్థం అవుతుంది. అలాంటి ఉత్తిత్తి హామీల హంగులు, వాటి వెనుక ఉన్న నిజాలు తెలుసుకోండి.

అన్నీ లొసుగులే

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను పబ్లిక్ గా కాపీ కొట్టి రెండువేలు పించన్ పథకం ప్రవేశ పెట్టాడు బాబు. కానీ ఇప్పటి దాకా ఇస్తున్న పింఛన్ లో ఎన్ని లొసుగులున్నాయో ఎవరికైనా తెలుసా? 2014 వరకూ పింఛన్లు వస్తున్న అర్హులైన పేదలెందరికో చంద్రబాబు అధికారంలోకి రాగానే పింఛన్లు ఆగిపోయాయి. టిడిపికి చెందరని తెలిస్తే చాలు వాళ్ల పింఛన్లు ఆపేశారు. జీవో ప్రకారం వృద్ధులకు పింఛను ఆపకూడదు. వేలి ముద్ర, ఐరిష్, పీడీఓ ఇమేజ్ మూడిటిలో ఏదో ఒక విధానం పాటించి పింఛను ఇవ్వాలి. కానీ ఐరిష్ ని పొర కమ్మేసిందని, ముద్రలు పడటం లేదని సాకులు చెప్పి పింఛన్లు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. ఆరోగ్యం బాగోకో లేక వేరే ఊరికి వెళ్లో వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే లిస్టులోంచి పేరు తొలగించేస్తున్నారు. కనీసం నిర్థారించుకునే ప్రయత్నమే చేయడం లేదు. అంటే మూడు నెలలు లేకపోతే ఆ వ్యక్తి మరణించినట్టే ధృవీకరించేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఆగేది వాళ్లు అనర్హులైనప్పుడు లేదా మరణించినప్పుడు మాత్రమే. కానీ కొన్ని నెలలు రాలేకపోయినంత మాత్రాన వారిని పథకానికే దూరం చేసేస్తున్నారు.

ఎల్లో కమిటీల చేతుల్లో

అర్హతలు ఉండి, అవసరమైన ధృవీకరణ పత్రాలు ఇచ్చినా కూడా చాలామందికి పింఛన్లు సాంక్షన్ కావడం లేదు. జన్మభూమి కమిటీ సంతకం కావాలనే మెలిక పెడుతున్నారు. జన్మభూమి కమిటీ ఏదైనా గవర్నమెంట్ అథారిటీయా? లేక వాళ్లు ప్రభుత్వ అధికారులా? అన్ని అర్హతలు ఉండి కూడా జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గర బ్రతిమాలుకుని, ఎదురు చూడాల్సిన ఖర్మ ఎందుకు పట్టిస్తున్నారు? మొదటి విడత జన్మభూమి కమిటీలో పెట్టిన అర్జీలకే దిక్కూ మొక్కూ లేదు. అప్పుడే అరడజను కమిటీలు అయిపోయాయి. అర్హులెవరైనా మాకెందుకు పింఛన్ సాంక్షన్ కాలేదని అడిగితే వివరాలు ఆన్ లైన్లో ఉన్నాయి చూసుకోండి పొమ్మంటున్నారు. ఇంతవరకూ ఇంతమంది అర్జీలు పెట్టారు, ఇందరికి పింఛను సాంక్షన్ అయ్యిందనే సాంక్షన్ లిస్టు విడుదల చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అర్హులకు పథకాలు వర్తింపచేయకపోగా, మీ ఊళ్లో జన్మభూమి కమిటీ నుంచి సంతకం తెచ్చుకోమంటున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్నీ, పాలనా వ్యవస్థలను జన్మభూమి కమిటీల చేతుల్లో బందీలను చేసి చంద్రబాబు ఆడుతున్న కపట నాటకాలకు పింఛన్లు ఒక ఉదాహరణ.

తాజా వీడియోలు

Back to Top