– రాహుల్‌తో చంద్రబాబు భేటీ అందుకే...!– ప్రతిగా తెలంగాణ ఎన్నికల్లో ఆర్థిక సహకారం– జగన్‌పై హత్యాయత్నం కేసు నుంచి బయట పడేయాలని వేడుకోలు– తెలంగాణలో సీట్ల చర్చ నేపథ్యలో తెరవెనుక మంత్రాంగం అదే..!

సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటానని చెప్పుకు తిరిగే చంద్రబాబు.. సంక్షోభాలు తలెత్తిన ఏ సందర్భంలోనూ ఆయన ప్రజలకు అండగా ఉండిన దాఖలాలు లేవు. ఆ సంక్షోభాలు తనకెక్కడ చుట్టుకుని సీఎం పీఠానికి ఎసరు పెడతాయోనని అల్లాడిపోతుంటాడు ^è ంద్రబాబు. కనీసం ఆయా సందర్భాల్లో చంద్రబాబు రాష్ట్రంలో కూడా ఉండరంటేనే తెలియడం లేదా ఆయన మాటలకు చేతలకు పొంతన ఉండదని. జనం నవ్వుతారనే బాధ కూడా ఉండదు చంద్రబాబుకి. ఎల్లో మీడియా ఉంది కదా కవర్ చేయడానికి అనే ధీమాతో సమస్య సమసి పోయిన తర్వాత తీరిగ్గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతాడు. తానెంతో పోరాడినట్టు చెప్పుకుంటాడు. పక్కనే ఉన్న నలుగురైదుగురు భజన నాయకులతో ఆయనకు మద్దతుగా మాట్లాడించుకుంటాడు. ఆ వెంటనే రెండు మూడు రోజులు అనుకూల మీడియాలో పెయిడ్ స్టోరీలు ప్లాన్ చేస్తారు. చివరికి చంద్రబాబే లేకుంటే సమస్య ఎంత పెద్దదయ్యేదో అన్నట్టుగా జనాన్ని నమ్మించి మీ చావు మీరు చావండని జనాన్ని వదిలేస్తారు. సొంత వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి వెళ్లిన ప్రతిసారీ చంద్రబాబు జనానికి చెప్పే ఒకే కథ చెబుతాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చారిత్రక నిర్ణయం తీసుకుంటున్నానని మీడియాలో ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతాడు. ప్రతి చిన్న విషయంలోనూ సానుభూతి, పబ్లిసిటీ కోసం వెంపర్లాడతారని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడూ అంతే.. రాష్ట్రంలో సీబీఐ దాడులు, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన బాట పట్టాడు. పైకి మాత్రం బీజేపీ నిరంకుశ విధానాలను ఎండకట్టడానికే అని చెబుతున్నా.. తెరవెనుక మాత్రం తనపై సీబీఐ విచారణ జరగకుండా నిలువరించుకునేందుకు పైరవీలు చేయబోతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీబీఐలో అలజడి వెనుక టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా జగన్‌మోహన్‌రెడ్డి మీద జరిగిన హత్యాయత్నంపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదు. దీనిపై వైయస్‌ఆర్‌సీపీ నాయకులు.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ను కలిసిన నేపథ్యంలో సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే హత్యాయత్నం వెనుక టీడీపీ నాయకుల పాత్ర బయటపడుతుందని చంద్రబాబు భయం. ఈ నేపథ్యంలో తెరవెనుక లాబీయింగ్‌ల కోసమే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ నాయకులపై సీబీఐ దాడులు నిలువరించడంతోపాటు.. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్య కుట్రను సీబీఐకి అప్పగించకుండా అడ్డుకోవడానికే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. తనను కాపాడమని కాంగ్రెస్ నాయకులను వేడుకుంటారని తెలుస్తోంది. తన పేరు బయటకు రాకుండా ఉండేలా చేస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి కూడా ఆర్థికంగా సహకారం అందిస్తానని చెప్పినట్టు పొలిటికల్ సర్కిళ్లలో ఊపందుకున్న ప్రచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు.. టీడీపీ ఓట్లు మళ్లించి గెలిచేందుకు సహకరించడంతోపాటు ఆర్థిక సహకారం కూడా చే స్తామని చంద్రబాబు హామీ ఇస్తారని మాట్లాడుకుంటున్నారు.

మిర్చికి మద్దతు ధర లేదని జనం రోడ్డెక్కితే చంద్రబాబు అమెరికా వెళ్లాడు. ఉద్యోగాలు తెస్తానని చెప్పి స్పెషల్ ఫ్లయిట్‌లో వెళ్లిన మనిషి జనం నెత్తిన అప్పులు మోపాడు. శ్రీకాకుళంలో వరదలొచ్చి అల్లాడుతుంటే టీడీపీ నాయకులతో ఫ్లకార్డులు తయారు చేయించి మీరు లేకుంటే ఏమయ్యేవాళ్లమో అన్నట్టు బిల్డప్ కొట్టాలనుకుని విఫలమయ్యాడు. జనం చంద్రబాబునే ఎదురు ప్రశ్నించడంతో పలాయన మంత్రం పటించాడు. రాష్ట్రమంతా కరువుతో అల్లాడుతుంటే.. హెలికాప్టర్ నుంచి పరిశీలించిన చరిత్ర చంద్రబాబుది.