40 ఇయర్స్ పాలిటిక్స్ ఇక్కడ...అయినా పోలవరం అర్థం కాలా!

ఎద్దులా వచ్చిన వయసు, గద్దలా వంగిన ముక్కు అంటారు...ఏళ్లకేళ్లు వయసున్నా వ్యవహార జ్ఞానం సున్నా అయితే ఇలా అంటారు. మరి క్రితం ఎన్నికలప్పుడు అనుభవం ఉన్నవాడిని, అభివృద్ధి చేసిన వాడిని అని సొంత డబ్బాను డప్పులతో ఊరంతా కొట్టించుకుని మరీ ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నలభై ఏళ్లు అనుభవం ఉన్న నాకే పోలవరం అర్థం కావడం లేదన్నాడంటే ఏమనుకోవాలి...? ఇన్నాళ్లకు నిజాన్ని ఒప్పుకున్నాడనుకోవాలి. తొమ్మిదేళ్లు మునుపు ముఖ్యమంత్రిగా పని చేసినా పోలవరం గురించి పన్నెత్తి మాట్లాడని బాబు, 2014లో అధికారంలోకి వచ్చేసరికి పోలవరం జీవనాడి అని అన్నాడు. సోమవారం పోలవారం అని కబర్లు చెప్పాడు. నలభై సార్లు పోలవరాన్ని చుట్టొచ్చాను, గట్టుమీద నిద్దరోయాను అని కహానీలు చెప్పాడు. అసెంబ్లీలో పేపర్ల కొద్దీ పోలవరం లెక్కలను అప్పజెప్పాడు. తీరా ఇప్పుడేమో నాకే అర్థం కాలేదు పోలవరం మీకేమర్థమయ్యిందని ఎదురు ప్రశ్నలేస్తున్నాడు. 
వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, అంతకుముందు పవన్ కళ్యాణ్ పోలవరాన్ని చూసి ఇది సకాలంలో పూర్తయ్యే అవకాశం లేదని చెప్పారు. నిజానికీ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఎప్పుడో చెప్పారు. కాఫర్ డ్యామ్ పనుల్లో జాప్యం ఉందని, ట్రాన్స్ ట్రాయ్ తో పాటు మట్టిపనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు ఇవ్వడం లేదని బయట పెట్టారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని బహిర్గతం చేసే సరికి, ప్రభుత్వం ఆ విషయాన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. చాలాకాలంగా తొక్కిపెట్టిన వ్యవహారం కాస్తా కేంద్రం దాకా చేరింది. కేంద్రకమిటీలు రావడం, పోలవరంపై నిజ నిర్థారణలు జరిగాయి. కొత్త టెండర్ల పేరుతో లాలూచికి సిద్ధమైన బాబుకు పైనుంచి వచ్చిన ఆర్డర్లు మెట్టికాయల్లా తగిలాయి. 
అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోతున్న చంద్రబాబు సర్కార్ పోలవరం పై వేసిన కొత్తు ఎత్తుగడలను ప్రజల ముందు ఉంచడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పోలవరం నిర్మాణం కేంద్రాన్నే చేసుకోమంటూ బాబు మొదలెట్టిన ప్రచారాన్ని తిప్పి కొట్టింది. మరో పక్క బిజెపి నేతలు సైతం చంద్రబాబు రెండు నాలుకల తీరును ఎండగట్టారు. దాంతో ఇరుకున పడ్డ బాబు పవన్ కళ్యాణ్ ను తెరమీదకు తెచ్చారు. పోలవరం పూర్తి చేయడం ఎలాగో ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు. రేపు పూర్తి అవ్వలేదని ప్రజలు, ప్రతిపక్షం ప్రశ్నిస్తే ఎన్నికల సమయంలో పోలవరం పేరు వాడుకోవడానికి వీలు కాదు. అందుకే తాను చెప్పినట్టే పలికే చిలక పవన్ కళ్యాణ్ తో పోలవరం పనులు ఆలస్యం అవుతున్నాయని, అనుకున్న సమయానికి పోలవరం పూర్తి కాదని చెప్పించారు. ఆ చెప్పడంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇక రెండో పక్క తానేమో ఏం చేసైనా పోలవరాన్ని పూర్తి చేస్తాం, దీనిపై అవగాహన లేకుండా మాట్లాడవద్దంటూ స్టేట్ మెంట్లు ఇవ్వడం మొదలు పెట్టారు.
పోలవరం ఇచ్చిన గడువులోపల పూర్తి కాదనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయడం, ఆ తప్పు తనపై పడకుండా కేంద్రంపై రుద్దడం అనే రెండు లక్ష్యాలతో చంద్రబాబు పోలవరం రాజకీయ తంత్రాన్ని నడుపుతున్నాడని సీనియర్ పొలిటీషియన్లు అంటున్నారు. ఇదంతా బాబు స్ట్రేటజీలో భాగమని, ఎన్నికల సమయంలో పోలవరం పూర్తి కాకపోవడానికి కేంద్రం నిధులు సకాలంలో అందించకపోవడమే కారణమనే సాకుని చూపిస్తాడని, పోలవరం పూర్తి కావాలంటే మళ్లీ నాకే ఓట్లు వేయాలని అడుగుతాడని వారంటున్నారు. 
బాబు బండారం అంతా బయటపెట్టిన ప్రతిపక్ష నేత, ప్రజల నమ్మకాన్ని బాబు ఎలా వమ్ము చేసాడో అడుగడుగునా ప్రజా సంకల్ప యాత్రలో చూస్తున్నారు. ఇంతటి నీతిమాలిన ప్రభుత్వాన్ని గద్దెదించి, ప్రజా సంక్షేమ స్వాప్నికుడికే భవిష్యత్ పీఠం కట్టబెడతామని ప్రజలు ఆ యువనేత అడుగులపై ప్రమాణం చేసి మరీ చెబుతున్నారు. మార్పుకిది నాంది. నిబద్ధతలేని, విశ్వసనీయత తెలియని రాజకీయాలకు గుణపాఠం ప్రజా సంకల్పం. 

Back to Top