వైయ‌స్ఆర్‌ విద్యార్థి విభాగం యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్‌ల నియామకం

అమరావతి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీలోని యూనివర్సిటీలకు విద్యార్థి విభాగం ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ వైయ‌స్ఆర్‌ విద్యార్థి విభాగం ఇన్‌ఛార్జ్‌గా బీ. మోహన్‌ నియమితులయ్యారు. నాగార్జున వర్సిటీ ఇన్‌ఛార్జ్‌గా కిరణ్ నియమితులు కాగా‌, కాకినాడ జేఎన్‌టీయూ, కేఎల్‌ వర్సిటీల బాధ్యతలను కే రాజశేఖర్‌లకు అప్పగించారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఇన్‌చార్జ్‌గా పీ, మురళీ, ఎస్‌కేయూ, రాయలసీమ, విక్రమసింహపురి వర్సిటీలకు జీ లింగారెడ్డిను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం  శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
 
 

Back to Top