చార్జీల పెంపునకు నిరసనగా 26న ధర్నాలు

హైదరాబాద్, 24 సెప్టెంబర్‌ 2012: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీల పెండాన్ని నిరసిస్తూ ఈ నెల 26 (బుధవారం)నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో, కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు పార్టీ సోమవారంనాడు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి జంకూ గొంకూ లేకుండా రాష్ర్టప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూనే ఉందని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Back to Top