కర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర కర్నూలు జిల్లా కైరుప్పలకు చేరుకుంది. వైయస్ జగన్ పాదయాత్రకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. జననేతను కలుసుకునేందుకు ప్రజలంతా తండోపతండాలుగా కదిలివచ్చారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రతిపక్షనేత ముందుకు సాగుతున్నారు.