శ్రీ‌కాకుళం జిల్లాలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌- వైయ‌స్ జ‌గ‌న్‌కు సిక్కోలు ప్ర‌జ‌ల ఆత్మీయ‌ స్వాగ‌తం
- రాజ‌న్న బిడ్డ‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లా వాసుల ఘ‌న వీడ్కోలు
శ్రీ‌కాకుళం:  టీడీపీ దుష్టపాలనపై సమరభేరి మోగిస్తూ వైయ‌స్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంల్పయాత్ర విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి శ్రీ‌కాకుళం జిల్లాలోకి ప్ర‌వేశించింది. ఆదివారం మ‌ధ్యాహ్న భోజ‌న విరామం అనంత‌రం రావివలస క్రాస్‌ రోడ్డు మీదుగా.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. కెల్ల గ్రామం వ‌ద్ద జ‌న‌నేత‌కు సిక్కోలు ప్ర‌జ‌లు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.  అంత‌కు ముందు విజ‌య‌న‌గ‌రం జిల్లా వాసులు రాజ‌న్న బిడ్డ‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు.  రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిస్తూ.. 12 జిల్లాల్లో 124 నియోజకవర్గాల్లో అలుపెరుగని విక్రమార్కుడిలా పాదయాత్రను కొనసాగించిన జననేత వైయ‌స్‌ జగన్  శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెట్ట‌డంతో కెల్లా గ్రామంలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. శ్రీ‌కాకుళం జిల్లాల్లో రాజన్న తనయుడి పాదయాత్ర 10 నియోజకవర్గాలు మీదుగా సుమారు 350 కిలోమీటర్లు సాగనుంది. తమ సమస్యలను తెలుసుకునేందుకు జిల్లాకు వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు, పార్టీ నేత‌లు ఘనంగా స్వాగతం పలికారు.
Back to Top