చంద్రబాబును నమ్మి మోసపోయాం

వైయస్‌ జగన్‌ పాదయాత్రకు కాపు జేఏసీ నేతల సంఘీభావం

శ్రీకాకుళం: గత ఎన్నికల్లో చంద్రబాబును నమ్మి మోసపోయామని కాపు జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. మంగళవారం వైయస్‌ జగన్‌ను కాపు జేఏసీ నేతలు కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

కాపులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు.  ఐదు వేల కోట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారన్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ అండగా ఉంటానని మాట ఇచ్చారు. కాపులకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీపై కాపు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. 

జ‌న‌నేత వెంట మ‌హిళా నేత‌లు
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నాయ‌కురాళ్లు పాల్గొన్నారు. జ‌న‌నేత వెంట న‌డుస్తూ మద్ద‌తు తెలిపారు.వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక మ‌హిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తార‌ని వారు పేర్కొన్నారు. పాద‌యాత్ర‌లో ఎమ్మెల్యేలు క‌ళావ‌తి, పుష్ప‌శ్రీ‌వాణి, నాయ‌కురాళ్లు వ‌రుదు క‌ళ్యాణి, కొల్లి నిర్మ‌ళా కుమారి, త‌దిత‌రులు పాల్గొన్నారు

 

Back to Top