ప‌లాస‌కు పండ‌గొచ్చే



- ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం
- సిక్కోలు ప్ర‌జ‌ల ఆశీర్వాదాల‌తో కొన‌సాగుతున్న పాద‌యాత్ర‌
- ప్ర‌తిప‌క్ష నేత దృష్టికి వ‌స్తున్న ప‌లు వ‌ర్గాల స‌మ‌స్య‌లు 
శ్రీ‌కాకుళం:  న‌వ్యాంధ్ర ప్రగతే లక్ష్యంగా, పేదసామాన్య వర్గాల సంక్షేమమే పరమావధిగా నవరత్నాల్లాంటి పథకాలను వెంటబెట్టుకుని సాగుతున్న జగన్‌మోహనుడి జైత్రయాత్ర శనివారం పలాస నియోజకవర్గంలో అడుగుపెట్టింది. కాలినడకన వేలాది కిలోమీటర్లు పర్యటించి కోట్లాది జనుల గోడును ఆలకించి, వారి బంగరు భవిష్యత్‌కు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న ప్రతిపక్ష నేత జిల్లాలో ఇంతవరకు 8 నియోజకవర్గాల్లో 223.2 కిలోమీటర్లమేర ప్రజాసంకల్పయాత్ర సాగించారు. చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు, అక్రమాలతో నరకం అనుభవిస్తున్న ప్రజలను కలిసి వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి బాధలను తెలుసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో దీర్ఘకాలిక బాధలతో పాటు విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు తదితర ప్రధాన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సాధ్యమైన హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు. గత నెల 25న పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నడిమికెల్ల గ్రామం వద్ద ప్రారంభమైన శ్రీకాకుళం జిల్లా యాత్ర పాలకొండ, రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం తదితర ఎనిమిది నియోజకవర్గాల్లో దిగ్విజయంగా  పూర్తయింది.  

రాజ‌న్న బిడ్డ‌కు ఆత్మీయ స్వాగ‌తం
 అప్రతిహతంగా సాగుతున్న జగనన్న పాదయాత్ర శనివారం 332వ రోజున పాతపట్నం నియోజకవర్గంలో  పూర్తి చేసుకుని, పలాస నియోజకవర్గంలో ప్రవేశించింది.  మెళియాపుట్టి మండలంతూముకొండ, పెద్దమడి స్కూల్, హీరాపురం, పెద్దమడి గ్రామం, చీపురుపల్లి సమీపం వరకు యాత్ర సాగింది. మధ్యాహ్న విరామం తర్వాత పలాస మండలం రేగులపాడు వద్ద తిరిగి యాత్ర ప్రారంభ‌మైంది. పలాస నియోజకవర్గం సరిహద్దు కావడంతో ఇక్కడే పార్టీ శ్రేణులంతా జగనన్నకు స్వాగత ద్వారం ఏర్పాటు చేసి ఘనంగా ఆహ్వానం పలకారు. ప్రజా సంకల్పయాత్ర తుది గమ్యం చేరుకునే దిశలో మరొక్క నియోజకవర్గమే మిగిలివుంది. సిక్కోలు ప్ర‌జ‌ల ఆశీర్వాదాల‌తో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర సాగుతుండ‌గా ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత దృష్టికి తీసుకొస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా వింటున్న రాజ‌న్న బిడ్డ మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
Back to Top