<strong>వైయస్ జగన్ సీపీఎస్ రద్దు హామీపై హర్షం..</strong>విజయనగరంః ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. సీపీఎస్ రద్దు చేయాలని వైయస్ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ హామీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావం తెలిపారు.వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైయస్‌ఆర్‌సీపీ గెలిచి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అవుతారని విశ్వాసవ్యక్తం చేశారు. జననేత నాయకత్వంలో ఉద్యోగులకు,ఉపాధ్యాయలకు న్యాయం జరుగుతుందన్నారు.