బుద్ధా వెంక‌న్న సోద‌రుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

బుద్ధా వెంకన్న ఏనాడూ బీసీల కోసం పోరాడలేదు

వైయ‌స్‌ జగన్‌తోనే బీసీలకు న్యాయం: బుద్ధా నాగేశ్వరరావు

అమరావతి: అధికార తెలుగు దేశం పార్టీకి మ‌రో షాక్ తగిలింది. ఏపీలో అధికార టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి.  ప్రభుత్వం విప్‌, టీడీపీ నేత బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో మంగళవారం వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్‌తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

బుద్ధా వెంకన్న ఏనాడూ బీసీల కోసం పోరాడలేదని, ఇంకా చాలమంది బీసీ నేతలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దివంగత వైయ‌స్ఆర్‌ హయాంలోనే బీసీలకు ఎంతో మేలు జరిగిందని ఆయన గుర్తుచేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటుచేస్తామని జగన్‌ హామీ ఇచ్చారని, బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పిస్తారని అన్నారు. కార్య‌క్ర‌మంలో విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ర్జీ యలమంచిలి రవి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top