చంద్రబాబు పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం

విజయనగరంః పంచాయతీ ఎన్నికలు వెంటనే నిర్వహించి గ్రామస్వరాజ్యాన్ని కాపాడాలని లోకల్‌ గవర్నమెంట్‌ ఛాంబర్‌ జాతీయ అధ్యక్షులు ఎం.అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు.లోకల్‌ గవర్నెన్స్‌ ఛాంబర్‌ ప్రతినిధులు వైయస్‌ జగన్‌ను కలిసి పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యంపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు టీడీపీ అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ ఎన్నికల 73వ రాజ్యాంగ సవరణ అమలుచేస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత  పంచాయతీరాజ్‌ వ్యవస్థను నీరుగార్చి అన్నివర్గాలను మోసం చేసిందన్నారు. రాజ్యాంగం  ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాని టీడీపీ ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం జీవో 90 తీసుకొచ్చి ప్రత్యేకాధికారుల పాలన  ప్రవేశపెట్టారని విమర్శించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. 73వ రాజ్యాంగ సవరణ అపహస్యం పాలవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరువల్ల  కేంద్ర ప్రభుత్వం రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.3 వేల 705 కోట్ల మేర  నిధులను గ్రామపంచాయతీలు నష్టపోయాయని తెలిపారు.  అమ్మ బువ్వపెట్టనే పెట్టదు.. అడుక్కోనివ్వదు.. అన్న చందగా  రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లు ఒక పైసా కూడా ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన  నిధులను కూడా నష్టపోవాల్సి వస్తున్నదన్నారు. దీనికి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ బాధ్యత వహించాలన్నారు.
 

Back to Top