అందుకే ‘నిన్ను నమ్మం బాబు’ అంటున్నారు 

ఇచ్చాపురం సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
 

శ్రీకాకుళం: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే అన్నివర్గాల ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటున్నారని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు.

 చంద్రబాబు పాలన మీద నా అనుభవాలు మీతో పంచుకుంటాను.ఇడుపులపాయల నుంచి ఈ యాత్ర ప్రారంభించాను. పాద‌యాత్ర నా గుండెల్లో చెరగని ముద్రలు వేసుకున్నాయి. అనంతపురంలో శివన్న అనే రైతు కలిశాడు. తన పొలంలో రెయిన్‌ గన్లు గురించి  కథలు కథలుగా చెప్పాడు.  అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో వ్యవసాయం ఎలా కుదేలు అయిపోయిందో, రైతులు ఎలా కూలీలుగా మారిపోయారో, లక్షల మంది ఎలా వలసపోతున్నారో కళ్లారా చూశాను. శివన్న‌ నాతో అంటూ అన్నా..తొంభై వేలు అప్పు చేశానన్నా ఐదు ఎకరాల పొలంలో వేరుశనగ పంట వేశానన్నా.. చంద్రబాబు గారు వచ్చారన్నా..బాబు గారు వస్తే కరువు కూడా వస్తుందన్నా అని చెప్పుకొచ్చాడు. అన్నా.. యథాప్రకారం కరువు వచ్చిందన్నా రైతులు విలవిలాడుతున్నారన్నా.

  చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కరువుతో ఉన్నాం  సాయం చేయండి అని అడిగామని.. కరువు వచ్చిందా నాకు ఇంత వరుకు తెలియదే.. అధికారులు ఇంతవరుకు చెప్పలేదే..అంటూ అధికారులను తిట్టాడన్నా చంద్రబాబు. డ్రామా కాస్త ముందడుగు వేసి ఆ తర్వాత ఆయన రెయిన్‌గన్‌ డ్రామా మొద‌లుపెట్టాడు. రెయిన్‌ గన్లు ఏర్పాటు చేయడానికి యాదృచ్చికంగా శివన్న పొలాన్ని ఎంపిక చేశారు. శివన్న నా దగ్గర వచ్చి అన్నా.. అధికారులు  రెయిన్‌గన్లు ద్వారా నా పంటను కాపాడతాను అని అన్నారన్నా..పోలంలో రెయిన్‌ గన్లు సిద్ధం చేశారన్నా ఒక పంట కుంట తవ్విరన్నా..టార్పాలిన్‌ వేశారన్నా. ఒక ట్యాంకర్‌తో నిళ్లు నింపారన్నా..ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారన్నా..రెయిర్‌ గన్‌ ప్రారంభించారన్నా.. అలా అలా నాలుగు నీళ్లు చల్లాడన్నా..ఫోటోలకు మాత్రం ఫోజులిచ్చాడన్నా.

టీవీలు,పేపర్లలో విపరీతంగా ఫోటోలు వచ్చాయన్నా... చంద్రబాబు వెళ్ళిపోయాడన్నా.. మధ్యాహ్నం భోజనం చేద్దామని ఇంటికెళ్ళాలన్నా..సాయంత్రం  వచ్చే సరికి టార్పాలిన్‌ మడత పెట్టేశారన్నా. రెయిన్‌ గన్లు  సంకలో పెట్టుకుని వెళ్ళిపోయారన్నా, పంట కుంటలో నీళ్లు కూడా లేవన్నా అని చెప్పారు. టీవీలో,పేపర్లలో వచ్చిన ఫోటోలు శివన్న నా దగ్గరకు తెచ్చి చూపించాడు..ఇందన్నా నా పరిస్థితి అని అన్నాడు. ఐదు ఎకరాలలో ఎంత పంట పడిందో తెలుసా అన్నా అన్నాడు .ఐదు ఎకరాల్లో పంట వేస్తే నా పొలంలో పండిన పంట కేవలం అర బస్తా మాత్రమే పండిదన్నా అని చెప్పాడు. అప్పులు తీర్చడం కోసం వడియాలు, మురెలు అమ్ముకోవలసిన పరిస్థితుల్లో  ఉన్నానన్నా అని చెప్పుకొచ్చాడు. శివన్న‌ను  మీటింగ్‌లో మాట్లాడతావా అని అడిగాను..  శివన్నకు మైక్‌ ఇచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా కిందటిసారి చంద్రబాబుకు ఓటేశా..చివరికి ఇలా అయ్యాను ఇక మనకు చంద్రబాబుతో సావాసం వద్దప్పా ఇది శివన్న ప‌లికిన మాట‌లు. అందుకే గ్రామస్థాయిలో రైతన్నలు చంద్రబాబును ఎమంటారున్నారో తెలుసా.. నిన్ను నమ్మం బాబు అంటూముక్త‌కంఠంతో నిన‌దిస్తున్నారు..

ఇదే బాబు గారి హయాంలో ఐదేళ్లు కరువు, తుపాన్లు..రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇన్‌పుట్‌ రాదు. రైతులు అల్లాడుతున్నా.. కేబినెట్‌ మీటింగ్‌ పెట్టి రైతులకు మేలు చేయాలనే ఆలోచన రాదు. 2018 జూన్‌ 1 నుంచి 2 వరుకు వర్షపాతం కోస్తా జిల్లాలో వర్షం లోటు మైన‌స్ 23.1 శాతం,. రాయలసీమ జిల్లాలో వర్షపాతం మైన‌స్ 50.3శాతం. వర్షంపాతంలోటు ఇంత దారుణంగా రైతన్నా పరిస్థితి ఉంటే జాతీయ రాజకీయాలు అంటూ డ్రామాలు మొదలుపెట్టారు. ఈ పెద్ద మనిషి బెంగుళూరు వెళ్తాడు కుమారస్వామితో కాపీ తాగుతాడు. కాని పక్కనే అనంతపురం ఉంటుంది. కరువుబారిన పడిన రైతులను తోడుగా ఉండాలనే ఆలోచన రాదు. ఇదే చంద్రబాబు మళ్లీ విమానం ఎక్కుతాడు. జాతీయ రాజకీయాలు అంటూ చెన్నై వెళ్లాడు..స్టాలిన్‌తో ఇడ్లి సాంబార్ తింటాడు. చెన్నై పక్కనే తన సొంత జిల్లా  చిత్తూరు ఉంది. 

ఆ జిల్లాలో రైతులు అల్లాడితున్నార‌న్న ధ్యాస  చంద్రబాబుకు పట్టదు. ప్రైవేటు విమానం ఎక్కి జాతీయ రాజకీయాలు అంటారు. కలకత్తా వెళ్తాడు..మమతా బెనర్జీతో  చికెన్‌ తింటాడు..కాని రైతుల కష్టాలు చంద్రబాబుకు పట్టవు. ఇదే పరిస్థితి చంద్రబాబు వచ్చాక పంటల దిగుబడి, విస్తీర్ణం పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. నాన్నగారి హయాంలో 2008–2009వ సంవ‌త్స‌రం లెక్కలు చూస్తే పంట విస్తీర్ణం 42.70 లక్షల హెక్టార్లలో పంటలు పడిస్తే చంద్రబాబు హయాంలో అది అక్షరాల పడిపోయి 40 లక్ష‌ల‌ ఎకరాలకు ప‌డిపోయింది.  దిగుబడి పది సంవత్సరాల అక్షరాల 166 లక్షల టన్నుల ఆహార ధాన్యం పండితే  చంద్రబాబు హయాంలో  157 లక్షలకు టన్నులకు పడిపోయింది.నందుల అనుసంధానం అంటారు. పట్టిసీమ నీళ్లను రాయలసీమకు అందించానని బొంకుతాడు. రెయిన్‌ గన్లతో కరువు జయించాను అంటాడు.దేశంలోనే వ్యవసాయంలో అత్యధిక వృద్ధి రేటు మన రాష్ట్రంలోనే ఉందని చంద్రబాబు బొంకుతాడు. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పే వ్యక్తిని చూసినప్పుడు రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నిన్ను నమ్మం బాబు అంటారు.
 

ముఖ్యమంత్రే దళారీలకు నాయకుడు
ముఖ్యమంత్రి అన్న వ్యక్తి రైతులకు మేలు చేసేలా ఆలోచిస్తారు. కానీ మన ముఖ్యమంత్రి దళారులకు నాయకుడిగా మారాడు. «తన సొంత సంస్థ హెరిటేజ్‌ కోసం రైతులను మోసం చేస్తున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1550 ఉంటే..రైతులకు రూ.1100 కూడా రావడం లేదు. ఉద్దానంలో జీడిపప్పు ఫేమస్‌. పలాస జీడిపప్పు చంద్రబాబు హెరిటేజ్‌ షాపుల్లో పొట్లాలలో పెట్టి కేజీ రూ.1100 చొప్పున అమ్ముతున్నారు. ఇక్కడేమో కేజీ రూ.600లకు మించి కొనడం లేదు. అందుకే ఇవాళ రైతుల నుంచి వస్తున్న మాట ఏంటంటే ‘నిన్ను నమ్మం బాబు’ అంటున్నారు.

డ్వాక్రా రుణాలు కట్టలేదని..
దారి పొడవునా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు చంద్రబాబు మోసాలను చెబుతున్నారు. డ్వాక్రా రుణాలు కట్టలేదని చివరకు కోర్టు మెట్లు ఎక్కించిన పరిస్థితి విశాఖలో జరిగింది. నేరుగా అక్కచెల్లెమ్మల ఇళ్లపై దాడులు చేసి తాళాలు వేస్తున్నారని చెబుతుంటే బాధనిపించింది. వడ్డీలు కట్టడానికి అక్కచెల్లెమ్మలు తాళిబొట్లు అమ్ముకుంటున్నారు. పొదుపు సంఘాల రుణాలు తడిసి మోపెడై వడ్డీలపై వడ్డీలు పెరిగాయి. ఇవాళ అక్కచెల్లెమ్మల రుణాల మాఫి మాట గాలికి వెళ్లింది. వడ్డీ సొమ్మును గత ప్రభుత్వాలు బ్యాంకులకు నేరుగా కట్టేవి. ఇవాళ సున్నా వడ్డీకి రుణాలు అందడం లేదు. 2016 అక్టోబర్‌ నుంచి వడ్డీ సొమ్ము కట్టడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఆ అక్కచెల్లెమ్మలు చంద్రబాబు గురించి ఏమంటున్నారంటే..నిన్ను నమ్మం బాబు అంటున్నారు.
ఉద్యోగాలు గోవిందా..
చిన్నపిల్లలు చదువు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. నిరాశతో ఉన్న యువతను చూశాను. అన్నా..బాబు వచ్చాడు..కానీ జాబు రాలేదంటున్నారు. అన్నా..బాబు వచ్చాడు..ఉన్న జాబులను ఊడగొడుతున్నారని అంటున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఉద్యోగాలు, హౌషింగ్‌లో ఉద్యోగాలు, ఆయుష్‌లో పని చేస్తున్న అక్కచెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా..సాక్షరాభారత్‌ ఉద్యోగాలు గోవిందా? మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న అక్కచెల్లెమ్మల ఉపాధి గోవిందా..రాష్ట్ర విభజన జరిగిన నాటికి రాష్ట్రంలో అక్షరాల లక్ష 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రిటైర్డు అయిన ఖాళీలతో కలిసి రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు.

ఉద్యోగాల భర్తీ ఎక్కడ బాబూ

 రాష్ట్ర విభజన జరిగే నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 1.42 లక్షలు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పదవీ విరణమ చేసిన వారి సంఖ్య కలుపుకుంటే 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు పాలనలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన దాఖలాలు లేవు. చంద్రబాబు పాలన గురించి యువతలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. చంద్రబాబు పాలనలో ఏపీపీఎస్సీ పరీక్షలు ఉండవు. మొక్కుబడిగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తారు. పోలీసు ఉద్యోగాలు నింపే ప్రయత్నం అసలు చేయరు. ఇక ఉద్యోగాలు ఎలా వస్తాయన్నా అని యువత ప్రశ్నించడం నా కళ్లతో చూశాను. కానీ చంద్రబాబు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నాడు. రూ. 20 లక్షల కోట్లు పెట్టుబడులకు 40 లక్షల ఉద్యోగాల్లో మీకేమైనా వచ్చాయా..? చంద్రబాబు పాలనలో కొత్తగా పరిశ్రమలు ఏవీ రాలేదు. కానీ ఈయన పెంచిన కరెంటు చార్జీల వల్ల, రాయల్టీస్‌ వల్ల పరిశ్రమలకు హక్కుగా ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకపోవడంతో ఆంధ్రరాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సహకార డెయిరీలు, చక్కర కర్మాగారాలు అన్నీ కూడా మూతపడుతున్నాయి. గతంలో చంద్రబాబు పరిశ్రమలు మూతపడేసి అమ్మేసిన చరిత్ర ఉంది. మిగిలిన వాటిని కూడా చంద్రబాబు మళ్లీ అమ్మేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఉద్యోగాల కోసం యువత వెతుకుతున్న పరిస్థితులు చూశా.. కర్నూలులో నాపరాతి పరిశ్రమలు మూతపడడం చూశా.. ప్రకాశంలో గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్పిన్నింగ్‌ మిల్లులు, ఉత్తరాంధ్రలో జూట్‌ మిల్లులు, ఫెరోఅలాయిస్‌ కంపెనీలు మూతపడ్డాయి. వేల సంఖ్యలో యువత రోడ్డు మీద పడడం చూశాను పాదయాత్ర. వారి సమస్యలు, దీనగాథలను చెబుతుంటే విన్నాను. చూశాను. 

భృతి ఇస్తానని మోసం చేసిన బాబూ నిన్ను నమ్మం

మరోపక్క చంద్రబాబు నిరుద్యోగ భృతి అన్నారు. ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలన్నది వాస్తవమే అయినా.. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి కరపత్రాలను, మనుషులను పంపించాడు. చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసిన పేపర్లు చూపించారు. ఆ లేఖలు చూపిస్తూ అమ్మా మీ పిల్లలు ఏ చదువు చదవాల్సిన పనిలేదు.. ఉద్యోగం అయినా, ఉపాధి అయినా ఇస్తాడమ్మా.. ఈ రెండింట్లో ఏదీ ఇవ్వకపోతే రెండేళ్లు చూపిస్తూ చెప్పమన్నారు. నెలకు రూ. 2 వేల భృతి ఇస్తానని చెప్పమన్నారని వారితో చెప్పించారు. ఎన్నికలు అయిపోయాయి. రూ. 2 వేలు చెప్పిన భృతి ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి. అక్షరాల 1.72 కోట్ల ఇళ్లులు ఉంటే నాలుగున్నరేళ్ల తరువాత ఎన్నికలకు నాలుగు నెలల ముందు 3 లక్షల ఇళ్లకు తీసుకువచ్చాడు. చెప్పిన రూ. 2 వేల భృతి వెయ్యికి తగ్గించాడు. తగ్గించి నిరుద్యోగ భృతి ఇచ్చేశానని, యువకులంతా చంద్రబాబుకు జైకొడుతున్నట్లు చెప్పుకుంటున్నాడు. అందుకే ఉద్యోగం కోసం వెతుకుతున్న ప్రతి యువకుడు నిన్ను నమ్మం బాబు అని పిలుపునిస్తున్నాడు. 

 

 

   

 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top