వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం మరో 15 రోజులు పెంపు

కర్నూలు: వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలోని వెలుగోడు రిజర్వాయర్‌ను పరివీలించిన అనంతరం రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ కుటుంబంలో ఇప్పటి వరకు 75 లక్షల మంది భాగస్వాములయ్యారని చెప్పారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండడంతో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని మరో 15 రోజులు పొడిగిస్తున్నట్లు వివరించారు. చంద్రబాబు అబద్ధపు హామీలతో మోసపోయిన ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీని ఆశ్రయిస్తున్నారన్నారు.

Back to Top