వడ్డీలు కట్టలేకపోతున్నాం

వైయస్ఆర్ కడప(దువ్వూరు)

)రుణాలు మాఫీ అవుతాయని ఆశలు పెట్టుకున్నాం. కానీ, ఇప్పుడా రుణాలకు వడ్డీలు కట్టలేకపోతున్నామని పలువురు మహిళలు మైదుకూరు ఎమ్మెల్యే రుఘురామిరెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దువ్వూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే గడపగడపకూ వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇళ్లకు భరించలేని విధంగా కరెంటు బిల్లులు వస్తున్నాయని ప్రజలు వాపోయారు. బాబు పరిపాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనని ఎమ్మెల్యే అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.Back to Top