తాగునీటి కష్టాలు

అనంతపురంః తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి టౌన్ లోని 3,4 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత కొన్నాళ్లుగా కొళ్లాయిలకు నీళ్లు రావడం లేదని, సమస్యను మున్సిపల్ అధికారులకు విన్నవించినా ఫలితం లేదని కాలనీవాసులు పెద్దారెడ్డికి మొరపెట్టుకున్నారు. మురికినీటితో తమ వీధులు కంపుకొడుతున్నాయని వాపోయారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top