నవరత్నాలు ప్రజల జీవితాలకు వెలుగునిస్తాయి

కంచికచర్ల : త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్ష్యుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు రాష్ట్ర ప్రజలందరికీ భరోసా కల్పించనున్నాయి. నవ్యాంధ్రలోని ప్రజలందరి కుటుంబ సభ్యుడిగా, రైతులకు, పేదలకు సమాజంలోని సకల సామాజిక వర్గాల వారికి అండగా, భరోసా ఇచ్చే అన్నగా, అందరితో మమేకమవుతూ త్వరలోనే రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అంటూ ఇప్పటికే ప్రజల్లో బాగా బలపడింది. ప్రజల జీవితాలకు నవరత్నాలు భరోసా కల్పిస్తాయని విశ్వాసం ఉంది. నవరత్నాల సభ నియోజకవర్గ స్ధాయిలో ఈ నెల5న కంచికచర్ల పట్టణంలో జరిగింది. ఈ సభకు నాలుగు మండలాల నుంచి వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు. నవరత్నాల సభ గురించి వారి మాటల్లో ......

వైయస్సార్‌ రైతు భరోసాతో సన్న, చిన్న రైతులకు రూ.50వేలు(కోటేరు సత్యనారాయణరెడ్డి రైతు, పెద్దాపురం, వీరులపాడు మండలం)
ఐదు ఎకరాల లోపున్న సన్న, చిన్నకారు రైతు కుటుంబాలకు రూ.50వేలు రైతులకు అందిస్తారని వైయస్సార్‌సీపీ నాయకులు తెలియజేశారు. రాష్ట్రంలో మొత్తం 76,21లక్షల రైతు కుటుంబాలలో 86శాతం కుటుంబాలకు ఈ పథకం లాభం చేకూర్చుతుంది. చాలా ఆనందంగా ఉంది. 

రానున్న రోజుల్లో జగన్‌ పార్టీకి అండగా ఉంటాం.
అమ్మ ఒడి పథకం పేదల చదువులకు ఆనందాన్ని నింపేవిగా ఉంది(పోలవరపు లక్ష్మీనారాయణ, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కంచికచర్ల)
భూమి లేని నిరుపేద కుటుంబాల్లో ఆనందాన్ని నింపేందుకు వారి పిల్లలను చదువించుకుంటే ప్రతి కుటుంబానికి రూ.10వేల నుంచి రూ.20వేలు చదువుకునే పిల్లల తల్లులకు జగన్మోహన్‌రెడ్డి ఇస్తామన్నారు. పేదవారంతా తమ పిల్లలను చదివిస్తే వారికి మంచి భవిష్యత్‌ అందించవచ్చు. కులమతాలకు అతీతంగా, భూమి లేని ప్రతి ఒక్కరికీ ఈ పధకం ద్వారా నగదు అందుతుంది. వారి జీవితాలకు వెలుగులు నింపేదిగా ఉంది అమ్మ ఒడి పథకం చాలా బాగుంది.

అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు(గురజాల సామ్యేలు, చింతలపాడు, చందర్లపాడు మండలం)
వైయస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికే ఇళ్లు ఇస్తున్నారు. కాని జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇస్తామన్నారు. ఇళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష.

రాజన్న పాలనలోని ఆరోగ్యశ్రీ పధకాన్ని తీసుకువస్తానన్నారు(షేక్‌ అబ్దుల్‌ఖాదర్, మోగులూరు)
చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ పధకం అనరోగ్యంగా తయారయింది. ఆసుపత్రులకు వెళితే వెంటనే వైద్యం అందటంలేదు, ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి కేటాయించింది తక్కువేనని వైద్యులు అంటున్నారు. రోగాలబారిన పడిన వారికి కార్పోరేట్‌ వైద్యం అందుబాటులో లేదు. 108 కి ఫోన్‌ చేస్తే 20 నిముషాల్లో రావాల్సిన అంబులెన్స్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్ధితి. అదేమంటే కొన్ని సార్లు చాలా దూరం ఉన్నామని అంబులెన్స్‌ సిబ్బంది అంటున్నారు. సకాలంలో వైద్యం అందటంలేదు. రాజన్న రాజ్యం వస్తే కుయ్‌...కుయ్‌ మంటూ 10 నిముషాల్లో ఇంటికి వస్తుంది.

జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్య నిషేదం(ముప్పాళ్ల సత్యనారాయణ, కొత్తపేట)
టీడీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. దీని వల్ల ఇంటింటా కాపురాల్లో చిచ్చు పెడుతోంది. మద్యం తాగటం వల్ల అనేక జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల అనేక మంది ప్రాణాలు పోతున్నాయి. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్య నిషేదం చేస్తానన్నాడు. అప్పుడు పిల్లల చదువులు, భవిష్యత్తు, కుటుంబాల ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడుతోంది.

Back to Top