టీడీపీ పాలనలో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ప్రతీ ఇంట్లో అరణ్యరోదనే. ఎన్నికల ముందు అదీ చేస్తాం, ఇదీ చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చి సగకాలం పూర్తిఅయినా ఇంతవరకు ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. రుణాలు మాఫీ లేదు. ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. పెన్షన్లు, రేషన్ ఉన్నవి కూడా ఊడబెరుకుతున్నారు. దీంతో, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. <br/><img src="/filemanager/php/../files/statics/unnamed%20(14).jpg" style="width:829px;height:622px"/><br/>కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకు వైయస్సార్సీపీ కొండంత అండగా నిలిచింది. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటుంది. బాబు పాలనలో ఏ ఒక్కరూ కూడా సంతృప్తిగా లేరు. బాబును నమ్మినందుకు నట్టేట ముంచారని ప్రజలు వైయస్సార్సీపీ నేతల వద్ద వాపోతున్నారు. అధైర్యపడొద్దని, జగన్నను ముఖ్యమంత్రిని చేసుకొని కష్టాల నుంచి గట్టెక్కుదామని నేతలు వారికి భరోసా కల్పించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుదామని పిలుపునిచ్చారు. <br/>