బాబు హామీలన్నీ మోసపూరితం

గొల్లప్రోలు: చంద్రబాబు ఎన్నిక‌ల హామీలన్నీ పచ్చి మోసపూరితమని...ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని వన్నెపూడి గ్రామస్తులు మండిపడ్డారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వినర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలో గడపగడపకూ వైయ‌స్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దొరబాబు ఇంటింటా పర్యటించి బాబు అబద్ధపు హామీలతో కూడిన కరపత్రాలను పంచారు. ఎన్నికల ముందు బాబు ఇచ్చిన అబద్ధపు హామీలను ప్ర‌జ‌ల‌కు వివరించారు. పలువురు మహిళలు చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, బంగారు వస్తువులను ఇంటికి తెచ్చి ఇస్తానని ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక హామీలను గంగలో కలిపేశారన్నారు. అనంత‌రం దొరబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలను మోసం చేయడంలో ఆరితేరిపోయారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పేదప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. ప్రజాసమస్యలపై వైయ‌స్సార్ సీపీ అలుపెరుగని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో మండల యువజన కన్విన‌ర్ బవిరిశెట్టి మణి, పార్టీ జిల్లా కార్యవర్గసభ్యులు కందా చినబాబు, మైనార్టీ సెల్ నాయకులు మొయిద్దీన్, ఎంపీటీసీ గారపాటి శ్రీనివాసరావు, నాయకులు నడిగట్ల చింతలరావు, వెలుగుల కోటిబాబు, స్థానిక నాయకులు మొయిళ్ల నాగులు, కందా రామకృష్ణ, సుబ్బారావు, బాబ్జీ, వెంకన్న , పాల్గుణ, వీరబాబు, దొడ్డిపట్ల సత్తిబాబు, గుడాల చినబాబు, మలకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top