హైదరాబాద్) కరువును ఎదుర్కోవటంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. దీనిమీద ప్రశ్నత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్ బాషా ప్రశ్నలు లేవనెత్తారు. ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదని, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవటం లేదని సభ దృష్టికి తీసుకొని వచ్చారు. దీనికి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమాధానం చెప్పారు. అప్పుడు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జోక్యం చేసుకొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గణాంకాలతో సహా వివరించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.