విదేశాలు తిరుగుతూ ఆర్థిక పరిస్థితి దుర్భరం అంటూ బీద అరుపులువైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షనేతపై ఆరోపణలుఆరోగ్యశ్రీ హైదరాబాద్‌లో ఎందుకు వినియోగించుకోకూడదుపోలవరం ఎప్పటిలోగా కడతారో.. స్పష్టమైన హామీ ఇవ్వాలివిజయవాడ: నాలుగేళ్ల పాలనలో ప్రచార ఆర్భాటం తప్ప చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టమనేని ఆదిశేషగిరిరావు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన వల్ల ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉందంటూ బీద అరుపులు అరుస్తూ.. వేల కోట్లు ఖర్చు చేస్తూ విదేశీ ప్రయాణాలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదిశేషగిరిరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదనో.. అధికారులు సక్రమంగా పనిచేయడం లేదనో కుంటిసాకులు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇవి తప్ప ఈ నాలుగేళ్లలో చంద్రబాబు చేసి ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా ఉందా అని ప్రశ్నించారు.
– ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ ఎందుకు ఉపయోగించుకోకూడదని ఆదిశేషగిరిరావు చంద్రబాబు సర్కార్‌ను నిలదీశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటీ కరణ చేయాలని సంబంధిత మంత్రి కామినేని చెబుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో లేని వసతులు ఉమ్మడి రాజధానిలో ఉంటే నిరుపేదలు ఉపయోగించుకోకూడదా అని ప్రశ్నించారు. – రాష్ట్ర విభజన అస్తవ్యస్తంగా జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, అసలు రాష్ట్ర విభజన ఏ విధంగా జరిగిందో ప్రజలకు తెలియదా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు విభజనకు మద్దతుగా లేఖ రాసిన సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు. – రాష్ట్ర విభజన పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం, అమరావతి క్యాపిటల్ నిర్మాణం వెసులుబాటు, 24 గంటల కరెంటు ఇవ్వడానికి ఉపయోగపడింది. అయినా కరెంటు కొనుగోలు ధర తగ్గినా చంద్రబాబు వినియోగదారులపై అధికార భారాన్ని మోపుతున్నారని ఆదిశేషగిరిరావు మండిపడ్డారు. – పోలవరం విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట, కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెబుతుందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎప్పటి లోగా పూర్తి చేస్తారు ఇరు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. – పోలవరం నిర్మాణానికి ప్రతిపక్ష వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందని చంద్రబాబు పార్టీ నేతలు అంటున్నారని, పోలవరం దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కలల స్వప్నం అన్నారు. అయనే ప్రాజెక్టును దగ్గరుండి డిజైన్ చేయించారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్ హయాంలో పోలవరం నిర్మాణ సమయంలో టీడీపీ నేతలు కేసులు వేసిన సంగతి వాస్తవం కాదా అని నిలదీశారు. – పట్టిసీమ ప్రాజెక్టు అంటూ టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, పట్టిసీమ ప్రాజెక్టును చూపెట్టి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు ప్రతిపక్షం వ్యతిరేకం కాదని, దాంట్లో జరిగిన అవినీతికి వ్యతిరేకమన్నారు.