- సీఎం స్థాయి వ్యవక్తి బెదిరింపులకు దిగడం దారుణం– వచ్చే ఎన్నికల్లో బీసీలంతా సంఘటితమై బాబుకు చుక్కలు చూపించాలిగుంటూరు: సీఎం స్థాయి వ్యక్తి నాయిబ్రహ్మణులపై బెదిరింపులకు దిగడం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజా దేవాలయంలో చంద్రబాబు ప్రవర్తన దేవునిలా లేదని, పది తలలున్న పెద్ద రాక్షసుడు చంద్రబాబు అని అభివర్ణించారు. నాయిబ్రహ్మణుల పట్ల చంద్రబాబు తీరు ఆక్షేపణీయమని అన్నారు. నాయి బ్రాహ్మణులు చాలా సౌమ్యులని, అలాంటి వారిపై చంద్రబాబు వీరత్వం చూపాలనుకున్నారన్నారు. కేంద్రంపై పోరాటం చేస్తానంటూ బాబు ప్రచారం చేసుకున్నారని, ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు బాబు నాయిబ్రాహ్మణులపై పడ్డారని ఎద్దేవా చేశారు. నాయి బ్రాహ్మణులను రాత్రి పిలిపించి బలవంతంగా సమ్మె విరమింపజేశారని విమర్శించారు. జాలర్లు, బ్రాహ్మణుల మీద కూడా ఆయన దౌర్జన్యం చేశారని గుర్తు చేశారు.
ఉద్యమాలను అణచివేయడం తప్ప వారి సమస్యలను చంద్రబాబు ఎప్పుడైనా పరిష్కరించారా అని అంబటి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా సంఘటితమై చంద్రబాబుకు చుక్కలు చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంటెలిజెన్స్ చిఫ్ వెంకటేశ్వరరావు పచ్చ చొక్కా వేసుకోవడం మంచిదని, ఆయనకు మహానాడులో సన్మానం చేయాలని సూచించారు. ప్రతి పక్ష నేతల ఫోన్ ట్యాప్ చేయడం అసంతృప్తులను సీఎం దగ్గరకు తీసుకెళ్లడమే ఆయన పని అని విమర్శించారు.