సమాధానం చెప్పలేక పారిపోయిన మంత్రులు

వైయస్ఆర్ జిల్లాః జిల్లా జడ్పీ మీటింగ్ వాడివేడిగా సాగింది. వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులు  పేదల సమస్యలను ప్రస్తావించగా... చర్చను డైవర్ట్ చేసి మంత్రులు వైయస్ఆర్, వైయస్ జగన్ లపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో వైయస్సార్సీపీ, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి ఆదినారాయణరెడ్డికి భంగపాటు ఎదురైంది.  వైయస్సార్సీపీ గురించి మాట్లాడే ముందు పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసరడంతో ఆదినారాయణరెడ్డి  బిత్తరపోయారు.

పేదలకు సంబంధించిన అర్థవంతమైన సమస్యను జడ్పీ మీటింగ్ లో లేవనెత్తితే సమాధానం చెప్పలేక మంత్రులు పారిపోయారని ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారాన్ని చూసుకొని మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే  శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారన్నారు. ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. పేదలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం మోసం చేస్తే దాన్ని ప్రస్తావించకూడదని పార్టీ ఫిరాయించిన మంత్రి ఆదినారాయణరెడ్డి, దొడ్డిదారిన మంత్రి అయిన సొమిరెడ్డి చెప్పడం హాస్యాస్పదమని రాచమల్లు శివప్రసాదరెడ్డి ఫైర్ అయ్యారు. 

గృహనిర్మాణాలపై  వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులు  మంత్రులను ప్రశ్నించగా నీళ్లు నమిలారు.  పేదలకు ఉచిత ఇళ్లు కట్టించాలని ఎమ్మెల్యే రాచమల్లు కోరగా..అసెంబ్లీలో చర్చించాలంటూ మంత్రి సోమిరెడ్డి సమాధానం దాటవేశారు. సోమిరెడ్డి వైఖరికి నిరసనగా  కింద కూర్చొని నిరసన తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top