సుప్రీంకోర్టులో వైయస్సార్సీపీ పిటీషన్

న్యూఢిల్లీ) ఎమ్మెల్యేల ఫిరాయింపు మీద వైయస్సార్సీపీ సుప్రీంకోర్టుని
ఆశ్రయించింది. ఈ మేరకు ఒక పిటీషన్ దాఖలు చేసింది. టీడీపీ లోకి ఫిరాయించిన
ఎమ్మెల్యేల ను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్ కు అనేకసార్లు వినతి
పత్రాలు ఇచ్చినా పట్టించుకోవటం లేదని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు.
దీంతో స్పీకర్, పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా చేరుస్తూ పిటీషన్ దాఖలు
చేశారు. 

Back to Top