ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఢిల్లీలో చేపట్టిన ఆమరణ దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరింది. పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వైయస్ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌లు ఈ నెల 6వ తేదీ నుంచి ఏపీ భవన్‌లో దీక్షలు చేపడుతున్నారు. అయితే వీరిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన నలుగురు సభ్యులు దీక్షను కొనసాగిస్తున్నారు. ఎంపీల దీక్షకు మద్దతుగా తొలిరోజు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనలు, నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించగా.. రెండోరోజు శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు చేపట్టారు. ఎంపీల త్యాగానికి పాదాభివందనం చేస్తూ వైయస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు అనంతపురంలో వారి ఫొటోలకు పాలాభిషేకం చేశారు. <br/>