చింతపల్లి: తన బంధువులు, టీడీపీ నాయకులకు లాభం చేకూర్చేందుకే ఏపీ సీఎం చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్సీపీ కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్సార్సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.<br/>విపక్ష నేతగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను చంద్రబాబు వ్యతిరేకించారని ఆమె గుర్తు చేశారు. తవ్వకాల వల్ల గిరిజనులకు, పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందని 2011లో ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారని, నిన్నమొన్నటివరకు ఈ లేఖ టీడీపీ వెబ్ సైట్ లోనూ ఉందని తెలిపారు. అధికారంలోకి వచ్చారు కాబట్టి బాక్సైట్ తవ్వకాలు తప్పుకాదు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.<br/>97 జీవో విడుదల చేసి గిరిజనుల అభివృద్ధి కోసమేనని చెప్పడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. నిజంగా గిరిజనులపై ప్రేమవుంటే గిరిజన గ్రామాలకు, తండాలకు మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు బాసటగా వైఎస్సార్సీపీ నిలుస్తుందని హామీ ఇచ్చారు.<span style="font-family:Arial, Helvetica, sans-serif;font-size:15px;line-height:25px"><br/></span>