ఎన్నికల్లో లబ్ధిపొందడానికే బాబు అబద్ద‌పు హమీలుతిరుపతిః  2014 ఎన్నికల్లో లబ్ధిపొందడానికే చంద్రబాబు అబద్ధ‌పు హమీలు ఇచ్చార‌ని,  కర్నూలు జిల్లా  ఆలూరులో రామయ్య దంపతుల ఆత్మహత్య మూమ్మాటికి ప్రభుత్వ హత్యేనని  నగరి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా దుయ్యబట్టారు. రుణమాఫీ వట్టి బూటకమని, ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికే చంద్రబాబు అబద్ధాల హమీ ఇచ్చారని విమర్శించారు. రుణమాఫీ కాక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మహిళా రుణాలు కూడా మాఫీ కాలేదన్నారు. చంద్రబాబు కార్మిక ద్రోహి అని చంద్రబాబు పాలనలో చిత్తూరు, రేణిగుంట ఫ్యాక్టరీ, విజయ పాల ఫ్యాక్టరీలు మూతబడ్డాయన్నారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్‌ మంచి గుర్తింపు పొందిందని కార్మికుల పొట్ట కొట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్‌ను ఇతర జిల్లాలకు తరలించేయత్నం జరుగుతోందన్నారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్‌ కార్మికులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందన్నారు. 
Back to Top