ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు పోలీసుల నోటీసు


కాకినాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తుని రూరల్‌ పోలీసులు నోటీసులు అందజేశారు. 2015 జులైలో ఇసుక రవాణాను అడ్డుకోవడంతో ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. రాజాపై అక్రమ కేసు నమోదు వెనుక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుల ఒత్తిడి ఉంది.  మూడేళ్ల తరువాత ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి యనమల సోదరులు వేధింపులు మొదలుపెట్టారు. ఈ మేరకు బుధవారం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయానికి వచ్చిన పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు.  క్రైమ్‌ పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు తుని ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు. కోర్టు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top