విజయవాడ: చంద్రబాబు తీరుకు న్యాయస్థానం తీర్పు చెంపపెట్టులాంటిదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. మడకశిర ఎమ్మెల్యేగా డాక్టర్ తిప్పేస్వామిని నియమిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినా స్పీకర్ స్పందించకుండా నేరచరిత్ర కలిగిన అధికార పార్టీ ఎమ్మెల్యేను కొనసాగించడంతో సుప్రీం కోర్టు మెట్టికాయలు వేసిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వైయస్‌ఆర్‌సీపీ విజయంగా భావిస్తున్నామన్నారు. చంద్రబాబు నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు టికెట్లు ఇప్పించి, వారిని అడ్డదారిలో గెలిపించారన్నారు. శిక్షపడి కేసులున్న వారికి అధికారం కట్టబెట్టారన్నారు. డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యే కావాల్సి ఉండగా నాలుగున్నరేళ్లు దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారన్నారు. మా నాయకులు వైయస్ జగన్ ఆలోచన విధానం ఈ తీర్పుతో స్పష్టమైందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, డబ్బులు ఎరగా వేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని విమర్శించారు. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. ప్రజా కోర్టులో కూడా ఇదే తీర్పు ప్రజలు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నేరచరిత్ర కలిగిన ఎమ్మెల్యేను గెలిపించి, నాలుగున్నరేళ్లు దుర్వినియోగం చేసిన చంద్రబాబుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. తిప్పేస్వామి గెలుపు తొలి మెట్టు అన్నారు. ఇప్పటికైనా స్పీకర్, టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పునరాలోచన చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘటనలపై ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. మా పోరాటం కొనసాగుతుందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
న్యాయస్థానం తీర్పుతో ప్రజాస్వామ్యం నిలిచింది: ఉదయబానుతిప్పేస్వామి ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని,న్యాయస్థానం తీర్పుతో ప్రజాస్వామ్యం నిలిచిందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు ఉదయభాను తెలిపారు. చంద్రబాబు చట్టానికి, న్యాయానికి వ్యతిరేకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి ఏదో ఒక రోజు బయటకు వస్తుందని చెప్పారు. ప్రజా క్షేత్రంలో చంద్రబాబుకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

ఈ తీర్పు కనువిప్పు కావాలి: మల్లాది విష్ణుసుప్రీం కోర్టు తీర్పు టీడీపీకి, అసెంబ్లీ స్వీకర్‌కు కనువిప్పు కావాలని మల్లాది విష్ణు అన్నారు. తిప్పేస్వామి నాలుగేళ్ల విలువైన కాలాన్ని టీడీపీ వృథా చేసిందన్నారు. ఈ తీర్పు టీడీపీకి, అసెంబ్లీ స్వీకర్‌కు కనువిప్పు కావాలన్నారు. 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా టీడీపీ కండువాలు కప్పి మంత్రి పదవులు ఇస్తే..కోర్టులో పెండింగ్ ఉందని స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. చట్టప్రకారం వ్యవహరించాలని న్యాయస్థానం చెబుతుంటే ఎందుకు ఉదాసీన వైఖరి అవలంభిస్తారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఒక విధానం, పక్క రాష్ట్రంలో మరో విధానాన్ని చంద్రబాబు అవలంభిస్తున్నారన్నారు. పక్క రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఓడగొట్టాలని చంద్రబాబు పిలుపునిస్తూ..ఇక్కడ మాత్రం మంత్రి పదవులు కట్టబెట్టి రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని మల్లాది విష్ణు డిమాండు చేశారు. తిప్పేస్వామి మాదిరిగానే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా కోర్టు తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.