ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల్లో గెలుపొందుతాం
హత్యాయత్నంపై చంద్రబాబు స్పందిన తీరు దారుణం
వైయస్ జగన్ కోలుకోవాలని అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు
వైయస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: చంద్రబాబు ఎన్ని నీచరాజకీయాలు చేసినా ప్రజల ఆశీర్వాదంతో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితీరుతారని పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన తీరు దుర్మార్గమన్నారు. విజయవాడ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందితే.. ఇంటికెళ్లి వచ్చారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో టార్చ్‌లైట్ కూడా లేకుండా ప్రథమ చికిత్స చేశారని, వైద్యుల సలహా మేరకు, కార్యకర్తలు అధైర్య పడతారని హైదరాబాద్‌లో చికిత్స పొందారన్నారు.
అలిపిరిలో ఏ చేతికి గాయమైందో కూడా చంద్రబాబు తెలియదని, కుడిచేతికి గాయమైతే.. ఎడమ చేతికి కట్టుకట్టించుకున్నారని రోశయ్య అసెంబ్లీలో ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. చేతి కట్లు మార్చే చంద్రబాబు కూడా వైయస్ జగన్ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కోడిపందేలా కత్తితో నిందితుడు భుజంలో పొడిస్తే దాన్ని చిన్న గాయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంత్రి సోదిరెడ్డి మేము ప్లాన్ చేస్తే భయంకరంగా ఉంటుందని మాట్లాడుతున్నారని, చంద్రబాబు హడావుడిగా ఢిల్లీకి వెళ్లి ఏమీ లేదని ప్రెస్‌మీట్ పెట్టడం చూస్తుంటే ఇదంతా బాబు అండ్ కో వేసిన పథకమని అర్థం అవుతుందన్నారు.
చంద్రబాబు అలిపిరి ఘటన తరువాత ఇప్పటికీ ఏ చేతికి గాయం తగిలిందో తెలియదు. కుడి చేతికి గాయమైతే ఎడమ చేతికి కట్టుకట్టించారని రోశయ్య అసెంబ్లీలో మట్లాడారు. అటువంటి వ్యక్తి వైయస్ జగన్ గురించి మాట్లాడుతున్నారు. భుజం గాయం నుంచి వైయస్ జగన్ త్వరగా కోలుకోవాలని అండగా నిలబడి కోరుకుంటున్న 5 కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.