సీబీఐ విచారణ జరిపించాలి



– చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన ఛీడ
– మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌పై జరిగిన దాడి ఘటనపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండు చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.  వైయస్‌ జగన్‌పై జరిగిన దాడి దుర్మార్గమని, పార్టీలకు అతీతంగా అందరూ ఈ ఘటనను ఖండించాలన్నారు. చంద్రబాబు మొదట వైయస్‌ జగన్‌ను పరామర్శించాల్సింది పోయి..ఈ ఘటనను వైయస్‌ జగన్‌కు ఆపాదించాలని చూడటం కుట్రపూరితమన్నారు. భుజంలో తగలబట్టి సరిపోయిందని, అదే కత్తి గొంతుకు తగిలి ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా ఉండేదన్నారు. చేసిన వ్యక్తి వైయస్‌ఆర్‌సీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని డ్రామాలు ఆడుతున్నారన్నారు. డీజీపీ ఎందుకు తొందరపడి అలా చెప్పారో అర్థం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా అన్యాయంగా ఉన్నాయన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై దాడి చేయడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ చేపట్టాలని డిమాండు చేశారు. తప్పనిసరిగా సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండు చేశారు. పరామర్శించినందుకు ఎవరినో తప్పుపట్టడం సిగ్గు చేటు అన్నారు. మీకు మానవత్వం ఉంటే వైయస్‌ జగన్‌ను పరామర్శించేవారు అన్నారు. టీడీపీ మంత్రులు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన ఛీడ అని విమర్శించారు. ఆయన నిత్యం కుట్రలు, కుత్రంతాలు చేయడం మానుకోవడం లేదన్నారు. ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తీరు చూస్తేనే మీ స్వాభావం అర్థమవుతుందన్నారు. ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలని మేకపాటి కోరారు. 
 
Back to Top