విశాఖ: వైయస్ జగన్ నాయకత్వంలోనే గిరిజన సమస్యలు పరిష్కారమవుతాయని మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు అన్నారు. విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్రలో వైయస్ జగన్‌ను ఆయన కలిసి గిరిజన సమస్యలను వివరించారు. గిరిజన ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అరకు,పాడేరు ఆసుప్రతుల్లో వెద్యుల కొరత తీవ్రంగా వుందని, అటవీ ఫలసాయానికి కూడా మద్దతు ధరలేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న అనేక సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు రవిబాబు తెలిపారు.