నాలుగున్నరేళ్లుగా అగ్రిగోల్డ్ ఆస్తులు ఎందుకు తగ్గుతున్నాయిఅగ్రిగోల్డ్పై ప్రభుత్వ విచారణ సరిగా లేదుహాయ్లాండ్ ఎవరిదో సీఐడీ ఎందుకు తేల్చడం లేదుమాజీ సీఎస్‌ల ప్రశ్నలకు చంద్రబాబు, ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలిబాధితులకు వైయస్‌ఆర్ సీపీ అండగా ఉంటుందిఅధికారంలోకి రాగానే 14 లక్షల మంది కుటుంబాలను ఆదుకుంటాందమ్ముంటే వైయస్ జగన్‌ను ఎదుర్కోవాలని చాలెంజ్
విజయవాడ: కోట్ల రూపాయలు విలువ చేసే హాయ్‌లాండ్‌ను కొట్టేయాలని చంద్రబాబు అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని తప్పుదోవపట్టిస్తున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. తెలుగుదేశం పన్నిన పన్నాగం మూలంగా కొన్ని లక్షల కుటుంబాలు కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నాయన్నారు. బాధితులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం.. వారిని నట్టేట ముంచేందుకు చూస్తోందన్నారు. విజయవాడ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇస్తూ అగ్రిగోల్డ్ బాధితులను మభ్యపెడుతూ మోసం చేస్తుందన్నారు. కేవలం హాయ్‌లాండ్ కొట్టేయాలనే దురుద్దేశంతోనే బాధితుల సమస్య పరిష్కరించడం లేదన్నారు. 2016 నవంబర్‌లో అగ్రిగోల్డ్ తరుఫు న్యాయవాది రవిచంద్ర తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు, ఆయన కుమారుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అధికారంలోకి రాగానే 14 లక్షల మందిని అదుకుంటామని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రకటించారని గుర్తు చేశారు.
నాలుగున్నరేళ్ల నుంచి దాదాపు రూ. 20 వేల కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తులున్నాయని, తీర్చాల్సింది రూ. 6,800 కోట్లు మాత్రమేనని, ఎవరూ భయపడొద్దని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, మంత్రులు చెప్పారని పార్థసారధి గుర్తు చేశారు. దోపిడీకి వకల్తా పుచ్చుకొని అగ్రిగోల్డ్ విచారణ కమిటీ చైర్మన్ సీతాపతి, టీడీపీ నేత కుటుంబరావు ఆస్తులు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ప్రకారం రూ. 8 వేల కోట్లు ఉన్నాయని చెప్పారన్నారు. కొనుగోలు చేయడానికి వచ్చిన సంస్థ రూ. 4,800 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పిందన్నారు. సంవత్సరానికి ఆస్తుల విలువ ఏ విధంగా తగ్గుతూ వస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని కలవడానికి ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పిన వెళ్లిన చంద్రబాబు ఆంధ్రభవన్‌లో కొనుగోలు చేయడానికి వచ్చిన సంస్థ ప్రతినిధులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి బెదిరించి ఆస్తులు రూ. 2 వేల కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పించారన్నారు.
ఐదు రాష్ట్రాలకు విస్తరించిన సమస్య కాబట్టి అగ్రిగోల్డ్‌ను సీబీఐకి అప్పగించండి అని అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారన్నారు. న్యాయస్థానంలో రాష్ట్రానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ సీబీఐతో ఎంక్వైరీ చేయిస్తామని చెప్పారన్నారు. కానీ చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని జీఓ సైతం జారీ చేశారన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేయాలని ఏ విధంగా కుతంత్రాలు పన్నుతున్నారో ప్రజలంతా అర్థం చేసుకోవాలన్నారు. 2017 మార్చి 23న అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చెప్పిందన్నారు. ఏడాదిన్నర దాటినా ఇప్పటికీ సమస్య కొలిక్కి రాలేదని, కానీ బాధితులు మాత్రం మోసాలకు బలైపోతున్నారని ఆవేదన చెందారు.
నాలుగున్నరేళ్లుగా అగ్రిగోల్డ్ కేసు విచారణ చేస్తున్న సీబీ సీఐడీ హాయ్‌లాండ్ ఎవరిదో ఎందుకు తేల్చలేకపోతుందని ప్రశ్నించారు. సీఐడీ ఎంక్వైరీ చిత్తశుద్ధితో జరిగి ఉంటే స్పష్టమైన ఆధారాలు ఉండేవన్నారు. కొంత మంది వ్యక్తులు వచ్చి హాయ్‌లాండ్ అగ్రిగోల్డ్‌కు సంబంధించింది కాదని చెబితే న్యాయస్థానం సైతం ఆశ్చర్యపోతుందన్నారు. ఇప్పటికైనా సరే కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని, సీబీఐ లేదా ఇండిపెండెంట్ ఏజెన్సీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. విచారణను ప్రతిసారి తప్పుదోవపట్టించడానికి ప్రయత్నిస్తున్న తెర చాటు వ్యక్తులు ఎవరో కనిపెట్టాలన్నారు.
ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై, నిర్లక్ష్యంపై ఎవరు ప్రశ్నించినా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు బురదజల్లుతున్నాడని పార్థసారధి మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి పరుడు అంటే దాన్ని ఏపీ ప్రజలందరికీ అంటగట్టేలా చిత్రీకరిస్తున్నారన్నారు. దేవుడి పేరు చెప్పి దొంగ బాబాలు ఏ విధంగా దోచుకుంటున్నారో.. చంద్రబాబు కూడా ప్రజలను అడ్డుపెట్టుకొని నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్రం లెటర్ రాసినా, ప్రతిపక్ష వైయస్‌ఆర్ సీపీ ప్రశ్నించినా, సీపీఎం, సీపీఐ, పవన్ ప్రశ్నించినా ఐదు కోట్ల ప్రజలకు ఆపాదిస్తూ పబ్బం గడుపుకుంటున్నాడన్నారు.
మాజీ సీఎస్‌ల ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని పార్థసారధి డిమాండ్ చేశారు. దమ్ముంటే ఆ ప్రశ్నలకు ప్రస్తుత చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలని, ప్ర భుత్వ కార్యక్రమాలపై నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి రెస్పాండ్ కావాలన్నారు. కొంత మంది చెంచాగాళ్ల చేత చిప్పులేదు అని మాట్లాడిస్తున్నారని, ఐఏఎస్ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పే వారికి మొదడులో గుజ్జు ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణానికి చదరపు అడుగుకు రూ. 11,566 ఖర్చు చేసిందని, నిర్మాణ రంగంలో ఉన్నవారు ఎవరైనా ఈ చెల్లింపులు చూస్తే మూర్చపోతారన్నారు. నీరుగారే నిర్మాణాలకు ఇంత ఖర్చు అవుతుందా..? దయచేసి బిల్డర్లు రాష్ట్రంపై ప్రేమతో స్పందించాలన్నారు. ఎవరు ఏ విమర్శ చేసినా ప్రతిపక్షంతో కుమ్మక్కు అయ్యారని మాట్లాడుతున్నారని, తెలుగుదేశం ప్రభుత్వానికి దమ్ముంటే.. చంద్రబాబు నిప్పు అయితే అగ్రిగోల్డ్ సమస్యపై ఎంక్వైరీ వేసి నిజాయతీ నిరూపించుకోవాలన్నారు. దమ్ముంటే వైయస్ జగన్‌ను ఎదుర్కోవాలని ఛాలెంజ్ విసిరారు.