<br/><br/>శ్రీకాకుళంః చంద్రబాబు అవినీతి..విషసర్పం పడగలా దేశమంతా విస్తరిస్తోందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ గెలుపు కోసం ఐదు రాష్ట్రాలకు బాబు డబ్బు పంపించారని విమర్శించారు.అవినీతి సొమ్ముతో బాబు జాతీయ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.ఐదు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించింది తానేనని చంద్రబాబు చెప్పడం వెనుక అనేక అనుమానాలు వున్నాయన్నారు.చంద్రబాబు ప్రచారం చేయకుండా బీజేపీని ఓడించామని ఎలా చెప్తుతున్నారని ప్రశ్నించారు.ఏపీలో కూడా ఎంతడబ్భైన్నా ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు స్పష్టమైన సందేశం ఇచ్చారన్నారు.చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు ఏవిధమైన గుణపాఠం చెప్పారో, చంద్రబాబు చేతుల్లో మోసపోయిన ఏపీ ప్రజలు అంతకంటే ఎక్కువ బుద్ధి చెబుతారన్నారు.టీడీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.నాలుగేళ్ల పాటు చంద్రబాబు మోదీ సంకలో కూర్చోని ఆకాశానికి ఎత్తారన్నారు. ప్రత్యేకహోదా అనే మాటే లేదని, ఎవరైనా మాట్లాడితే జైలుకు పంపిస్తామని చెప్పి చంద్రబాబు బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.వైయస్ జగన్ అవిశ్వాసం ప్రకటించగానే చంద్రబాబు ప్రత్యేకహోదాపై యూటర్న్ తీసుకున్నారన్నారు.ప్రత్యేకహోదాపై అలుపెరగని పోరాటం వైయస్ జగన్ చేస్తుంటే.. ప్రత్యేక హోదాను వైయస్‌ఆర్‌సీపీ తాకట్టు పెడుతుందని చంద్రబాబు ఎదురుదాడికి దిగడం దుర్మార్గమన్నారు.ఏం మాట్లాడి చెల్లుబాటు అవుతుందనే ధీమాతో చంద్రబాబు ఉన్నారన్నారు.చంద్రబాబు అనుకూల మీడియా ఆయన ఏంÐ ]lూట్లాడిన ఆకాశంలో ఎత్తివేస్తున్నాయన్నారు.రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబు బుద్ధిచెబుతారన్నారు.