<strong>రాజన్న రాజ్యం కోసం ప్రజల ఎదురుచూపులు...</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ నేత బెల్లాన చంద్రశేఖర్</strong>విజయనగరంః చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేకపోయారని వైయస్‌ఆర్‌సీపీ విజయనగరం నియోజకవర్గం పార్లమెంటరీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ ఆరోపించారు. తమ నిజయోజకవర్గంలో జ్యూట్ మిల్లు సమస్య ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మళ్లీ రాజన్నరాజ్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. జూట్‌మిల్లుకు 100 ఎకరాల స్థలం ప్రభుత్వం లీజుకు ఇచ్చిందని, లీజుకిచ్చిన సమయం పూర్తయ్యింది. లీజుకిచ్చిన స్థలంలో సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నారని, వారిని జ్యూట్‌మిల్లు యాజమన్యం హైకోర్టుకు వెళ్ళి ఇళ్లు తొలగించాలని ప్రయత్నాలు చేస్తుందన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రామతీర్థ ప్రాజెక్టును ప్రారంభించి సుమారు 85 శాతం పనులు పూర్తిచేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో కనీసం రూ.10లక్షలు కూడా ఖర్చుపెట్టలేదన్నారు. వైయస్‌ఆర్ హయాంలో నెల్లిమర్ల నియోజకవర్గానికి సుమారు 40వేల ఇళ్లు ఇవ్వడం జరిగిందని, టీడీపీ పాలనలో కనీసం 3వేల కూడా ఇళ్లు ఇవ్వలేదన్నారు.