ఉద్య‌మంపై ఉక్కు పాదం

 
బంద్‌పై ఉక్కుపాదం మోపిన చంద్రబాబు సర్కార్‌
బలవంతంగా వైసీపీ నేతల అరెస్టుల పర్వం

వైయ‌స్ఆర్ జిల్లా  : ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా బంద్‌ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. తెల్లవారుజామునుంచే వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. బస్సులను డిపోలు దాటి రాకుండా అడ్డుకున్నారు. అయితే ప్ర‌భుత్వం ప్ర‌జా ఉద్య‌మంపై ఉక్కుపాదం మోపింది. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను బ‌ల‌వంతంగా అరెస్టు చేస్తూ, భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది.  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, కడప మేయర్‌ సురేష్‌ బాబు, ఆర్‌సీపీ అధ్యక్షుడు రవిశంకర్‌ రెడ్డి, పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. శాంతి యుతంగా చేపట్టిన బంద్‌ను అణచివేయడానికి జిల్లా వ్యాప్తంగా అదనపు బలగాలను రంగంలోకి దించింది. ఎక్కడ పడితే అక్కడ బంద్‌లో పాల్గొన్నవారిని బలవంతంగా అరెస్టు చేశారు. రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి, పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ శ్రేణుల‌ను  పోలీసులు నిర్భందించారు. కడపలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పాకా సురేష్‌, విద్యార్థి నేత ఖాజా రహంతుల్లాలను అదుపులోకి తీసుకున్నారు

ఉక్కుపోరాటం ఆగదు:
శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు మండిప‌డ్డారు . ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటుందని హెచ్చ‌రించారు. ప్రభుత్వం అడ్డుకున్నంత మాత్రానా ఉక్కుపోరాటం ఆగదని అంజాద్‌బాష, సురేష్‌బాబు పేర్కొన్నారు. వైయ‌స్‌ఆర్‌సీపీ పిలుపుతో "కడప ఉక్కు- మాహక్కు" అంటూ పెద్దఎత్తున ప్రజలు, యువత బంద్‌లో పాల్గొన్నారు.
 వైయ‌స్ఆర్‌సీపీ  నేతల‌ను అరెస్టు చేయడం దారుణమని నాయ‌కులు మండిప‌డ్డారు.  ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిని మర్చిపోయిందని విమర్శించారు. యువత తమ భవిష్యత్తు బాగుండాలంటే కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టితీరాల్సిందే అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  



Back to Top