కల్వకుర్తిలో వైయస్ఆర్ కాంగ్రెస్ సదస్సు

మహబూబ్నగర్ 28 జూన్ 2013:

మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం నాడు ప్రాంతీయ  సదస్సును నిర్వహించనుంది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆ సదస్సులో పాల్గొంటారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలపై కార్యకర్తలకు ఆమె ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఆమనగల్లులో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శ్రీమతి విజయమ్మ ఆవిష్కరించనున్నారు.

Back to Top