'ఉత్తరాఖండ్' బాధితులకు రూ.20 లక్షల సాయం

Smt.Vijayamma presenting Rs 20 lakhs cheque to Uttarakhand flood victims through party menహైదరాబాద్, 24 జూలై 2013: ఉత్తరాఖండ్ వరద‌ బాధితుల సహాయార్థం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రూ.20 లక్షల విరా‌ళాన్ని సేకరించింది. ‌పార్టీ ఎం.పి., ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల వేతనం సహా నాయకులు, అభిమానులు అందజేసిన విరాళాలతో ఈ రూ.20 లక్షలు సమకూరాయి. వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పార్టీ నాయకులు డి.ఎ. సోమయాజులు, డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డికి బుధవారంనాడు రూ.20లక్షల చెక్కును హైదరాబాద్‌లో అందజేశారు. ఈ చెక్కును పార్టీ నాయకులు ఉత్తరాఖండ్ ‌సిఎం రిలీఫ్ ఫం‌డ్‌కు అందజేయనున్నారు.

Back to Top