అధికారుల తీరుపై వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఆగ్రహం

అనంతపురం‌, 15 జూలై 2013:

పంచాయతీ ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై వైయస్ఆర్ కాంగ్రెస్ ‌పార్టీ సోమవారం‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో వారు సరిగా వ్యవహరించడంలేదని పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
కనేకల్ కాంగ్రె‌స్ అభ్యర్థి మహబూబ్‌‌బీకి ముగ్గురు పిల్లలున్నారని పై అధికారులకు ఆధారాలు సమర్పించామని రామచంద్రారెడ్డి తెలిపారు. అయినప్పటికీ ఆమె నామినేషన్ను ఎందుకు తిరస్కరించలేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. అధికార కాంగ్రె‌స్‌ పార్టీ ఒత్తిడి మేరకే అధికారులు పనిచేస్తున్నారని రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top